Bigg Boss 4: సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన హారిక.. కెప్టెన్సీ రేస్‌లో ఆ ముగ్గురు

పరమ బోరింగ్‌గా మారిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ ముగియడంతో వీక్షకులకు కాస్త రిలీఫ్‌ ఇచ్చినట్లు అయ్యింది. టాస్క్‌లో భాగంగా వరుస హత్యలు చేస్తున్న హారిక

Bigg Boss 4: సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన హారిక.. కెప్టెన్సీ రేస్‌లో ఆ ముగ్గురు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 06, 2020 | 7:13 AM

Bigg Boss 4 Telugu: పరమ బోరింగ్‌గా మారిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ ముగియడంతో వీక్షకులకు కాస్త రిలీఫ్‌ ఇచ్చినట్లు అయ్యింది. టాస్క్‌లో భాగంగా వరుస హత్యలు చేస్తున్న హారిక.. చివరగా అద్దంపై లిప్‌స్టిక్‌తో మెహబూబ్‌ చనిపోయాడు అని రాసింది. అక్కడే కుటుంబ సభ్యులకు చిక్కేసింది. ఆ తరువాత పంచాయితీలో కూడా గ్రామ పెద్ద సొహైల్‌, హారికను నిందితురాలిగా తేల్చాడు. కానీ అప్పటికి హత్యలన్నీ జరిగిపోవడంతో లాభం లేకుండా పోయింది. (ఎర వేసి ఉచ్చులోకి.. హైదరాబాద్‌లో మరో మోసం..)

ఇక టాస్క్ ముగిసిన తరువాత సీక్రెట్‌ టాస్క్‌ని విజయవంతంగా చేసిన హారిక కెప్టెన్సీ రేస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు వారాంతం ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ని నాగార్జున డైరెక్ట్‌గా కెప్టెన్సీ రేస్‌కి ఎంపిక చేశారు. ఇక గత వారం రోజులుగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ల పేరు చెప్పాలని వాళ్లే కెప్టెన్ పోటీదారులు అవుతారని బిగ్ బాస్ చెప్పగా.. తన పేరు చెప్పుకుని రెండో సారి కెప్టెన్ పోటీలో నిలిచింది అరియానా. ఇలా మొత్తానికి ఈ వారానికి ముగ్గురు కెప్టెన్సీ రేస్‌లో ఉండగా.. ఎవరు గెలుస్తారన్నది ఇవాళ తేలనుంది. ( ఈ మధ్యాహ్నం 10 ఉపగ్రహాలతో నింగిలోకి..)