శనివారం మధ్యాహ్నం 10 ఉపగ్రహాలతో నింగిలోకి..

శుక్రవారం మధ్యాహ్నం 1.03గంటలకు ప్రారంభమయ్యే కౌంట్‌డౌన్‌ శనివారం మధ్యాహ్నం 3.03గంటలకు ముగిసిన వెంటనే పీఎ్‌సఎల్వీ-సీ49 రోదసిలోకి దూసుకుపోనుంది. ఈ రాకెట్‌ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం...

శనివారం మధ్యాహ్నం 10 ఉపగ్రహాలతో నింగిలోకి..
Follow us

|

Updated on: Nov 06, 2020 | 2:48 PM

PSLV launch : ఇస్రో ధ్రువ ఉపగ్రహ వాహక నౌక (PSLV) 51వ సారి గగనయానానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఉన్న మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎ్‌సఎల్వీ-సీ49 రాకెట్‌ను ప్రయోగించే సన్నాహాల్లో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.

శుక్రవారం మధ్యాహ్నం 1.03గంటలకు ప్రారంభమయ్యే కౌంట్‌డౌన్‌ శనివారం మధ్యాహ్నం 3.03గంటలకు ముగిసిన వెంటనే పీఎ్‌సఎల్వీ-సీ49 రోదసిలోకి దూసుకుపోనుంది. ఈ రాకెట్‌ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్‌ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున, లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు.