AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : నాకు వర్షం సినిమాలాగే అనిపిస్తుంది.. ఇదొక అందమైన ప్రేమకథ.. యంగ్ హీరో మూవీపై ప్రభాస్ ప్రశంసలు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సంక్రాంతి పండక్కి ది రాజా సాబ్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. మరోవైపు ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటుండగా.. మరికొన్ని చిత్రాలు రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నాయి.

Prabhas : నాకు వర్షం సినిమాలాగే అనిపిస్తుంది.. ఇదొక అందమైన ప్రేమకథ.. యంగ్ హీరో మూవీపై ప్రభాస్ ప్రశంసలు..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2026 | 6:45 AM

Share

ప్రస్తుతం చిన్న సినిమాలు థియేటర్లలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ వారం మొత్తం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమా గురించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తనకు వర్షం సినిమా ఎలాగో.. అలాగే యంగ్ హీరోకు ఈ సినిమా అలాగే అంటూ రాసుకొచ్చారు. అసలు విషయానికి వస్తే.. యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హీరో నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జీవితంలో ఎలాంటి ఆశలు లేని ఓ కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం.. ఆ అమ్మాయితో ఒకే ఇంట్లో గడపాల్సి రావడం.. తర్వాత ఇద్దరి జీవితాల్లోకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది సినిమా.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

తాజాగా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. “ఇదొక లవ్లీ, బ్యూటీఫుల్ ఫిలిం. కపుల్ ఫ్రెండ్లీ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్, మానస వారణాసి జోడి వండర్ ఫుల్ గా ఉంది. అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి కథలను వెండితెరపైకి తీసుకువచ్చినందుకు అజయ్, యువీ క్రియేషన్స్ టీమ్ మొత్తానికి అభినందనలు. నాకు వర్షం సినిమా ఎలాగో.. మై డియర్ సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ అలా అవుతుంది” అంటూ రాసుకొచ్చారు ప్రభాస్. ఇప్పుడు డార్లింగ్ చేసిన ఈ పోస్ట్ ఈ చిత్రానికి బూస్టప్ లా పనిచేస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు. ఇందులో మానస వారణాసి కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

Follow Us
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అన్నా విడాకులు
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అన్నా విడాకులు
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్