AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే శరీరంలో జరిగే అద్భుతాలివే.. తెలిస్తే అస్సలు వదలరు..

మన వంటింట్లో లభించే పోషకాల గని వెల్లుల్లి. కేవలం రుచి కోసమే కాకుండా వేల ఏళ్లుగా ఆయుర్వేదంలో దీనిని ఒక శక్తివంతమైన ఔషధంగా వాడుతున్నారు. అయితే వెల్లుల్లిని కూరల్లో వేసుకోవడం కంటే, ఉదయాన్నే వెల్లుల్లి నీటి రూపంలో తీసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వెల్లుల్లి నీరు ఎందుకు తాగాలి? దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే శరీరంలో జరిగే అద్భుతాలివే.. తెలిస్తే అస్సలు వదలరు..
Amazing Benefits Of Drinking Garlic Water
Krishna S
|

Updated on: Feb 15, 2026 | 6:41 AM

Share

మన వంటిల్లే ఒక అద్భుతమైన ఔషధాల గని అని పెద్దలు చెబుతుంటారు. ఆ మాట అక్షర సత్యమని నిరూపించే అతిముఖ్యమైన ద్రవ్యం వెల్లుల్లి నీరు. సాధారణంగా వెల్లుల్లిని కూరలకు రుచి కోసం వాడతాం.. కానీ ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వెల్లుల్లి నీటిని తాగితే శరీరంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయో తెలుసా? మీ రోగనిరోధక శక్తిని రెట్టింపు చేయడం నుంచి గుండెను పదిలంగా ఉంచడం వరకు.. ఈ చిన్న అలవాటు ఒక నేచురల్ షీల్డ్‌లా పనిచేస్తుంది. అసలు వెల్లుల్లి నీటిలో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటీ..? బరువు తగ్గాలనుకునే వారు, బీపీతో ఇబ్బంది పడేవారు దీనిని ఎందుకు అమృతంలా భావిస్తారు? వంటింటి వైద్యంలోని ఈ అద్భుత రహస్యాలు, వెల్లుల్లి నీటిని పర్‌ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వెల్లుల్లి నీటితో కలిగే 6 అద్భుత ప్రయోజనాలు

ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం ఒక నేచురల్ యాంటీ బయాటిక్‌లా పనిచేస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది. తరచుగా జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది గొప్ప ఉపశమనం.

గుండె పదిలం – బీపీ నియంత్రణ

రక్తపోటు సమస్యతో బాధపడేవారికి వెల్లుల్లి నీరు ఒక వరప్రసాదం. ఇది రక్త నాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.

వెయిట్ లాస్ – మెటబాలిజం పెరుగుదల

బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ డైట్‌లో వెల్లుల్లి నీటిని చేర్చుకోండి. ఇది శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసి, అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు వెల్లుల్లి నీరు చెక్ పెడుతుంది. ఇది ప్రేగులలోని హానికరమైన వ్యర్థాలను తొలగించి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.

దృఢమైన ఎముకలు

వెల్లుల్లిలో కాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుండి కాపాడుతాయి.

ఊపిరితిత్తుల ఆరోగ్యం

వెల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసనాళాల్లోని వాపును తగ్గిస్తాయి. ఆస్తమా లేదా ఇతర శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి ఇది శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేయాలి?

స్టెప్ 1: రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు తీసి, వాటిని కొద్దిగా దంచండి.

స్టెప్ 2: దంచిన వెల్లుల్లిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి.

స్టెప్ 3: ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని త్రాగాలి.