AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని దాచి నాతో డేటింగ్.. ఈ హీరో చేసిన పనికి షాకయ్యాను.. హీరోయిన్ మమతా మోహన్ దాస్..

సినిమా ప్రపంచంలో కథానాయికలు ఎదుర్కొనే సవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్య. కెరీర్ ప్రారంభంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను ఇప్పటికే పలువురు హీరోయిన్స్ బయటపెట్టారు. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Tollywood : ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని దాచి నాతో డేటింగ్.. ఈ హీరో చేసిన పనికి షాకయ్యాను.. హీరోయిన్ మమతా మోహన్ దాస్..
Mamta Mohandas
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2026 | 7:07 AM

Share

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి, డేటింగ్, బ్రేకప్ వంటి విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. మరోవైపు తమ జీవితంలో చేదు అనుభవాలను, సవాళ్లను, కష్టాలను హీరోయిన్స్ సైతం బయటపెడుతున్నారు. ఇదివరకు చాలా మంది తారలు సినీ ప్రయాణం ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను వెల్లడించారు. తాజాగా హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మయూఖం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కింగ్, కేడీ, హోమం, విక్టరీ, చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే క్యాన్సర్ బారిన పడింది. దాదాపు రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే రుద్రాంగి చిత్రంలో కనిపించింది. ఇదిలా ఉంటే.. మమతా మోహన్‌దాస్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. “నాకు డేటింగ్, ప్రేమలో పెద్దగా అనుభవం లేదు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, ఒక మహిళగా నా అంచనాలను నెరవేర్చుకోవాలనుకున్నాను. ఆ సమయంలో ఒక ప్రముఖ మలయాళ నటుడు నన్ను డేటింగ్ కోసం అడిగాడు. అందుకు నా తల్లి సైతం నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అతడికి అప్పటికే వేరే మహిళతో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని నా దగ్గర దాచి పెట్టాడు. అసలు విషయం తెలిసి షాకయ్యాను. తర్వాత నా జీవితంలో మరో వ్యక్తిని కలుసుకున్నాను. కానీ ఈ ప్రేమ, డేటింగ్ అనవసరమని అన్నాడు” అంటూ చెప్పుకొచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

తర్వాత తన భర్త ప్రజిత్ గురించి మాట్లాడుతూ..”మేము అతని సోదరి వివాహంలో కలిశాము. మాకు ఒకరిలో ఒకరు నచ్చిన దాని గురించి మాట్లాడుకున్నాము. తర్వాత అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. మా వివాహం చాలా సింపుల్ గా జరిగింది. కానీ ఆరు నెలలకే ఆ వివాహం నుంచి బయటకు వచ్చాను. అది చాలా కష్టమైన నిర్ణయం. కానీ నేను నా అనారోగ్యంతో బాధపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ మంచి ఫాంలో దూసుకుపోతున్న సమయంలోనే మమతా మోహన్ దాస్ రెండుసార్లు క్యాన్సర్ బారిన పడింది.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది.. ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..