బిగ్ బాస్ 4: కెప్టెన్‌గా అవతరించిన మాస్టర్.. ఎలిమినేషన్ నుంచి సేఫ్.?

బిగ్ బాస్ సీజన్ 4లో పరిణామాలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కొక్కరిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వస్తుండటంతో..

  • Ravi Kiran
  • Publish Date - 5:33 pm, Fri, 6 November 20
బిగ్ బాస్ 4: కెప్టెన్‌గా అవతరించిన మాస్టర్.. ఎలిమినేషన్ నుంచి సేఫ్.?

బిగ్ బాస్ సీజన్ 4లో పరిణామాలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కొక్కరిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వస్తుండటంతో.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అభిమానులు అయోమయంలో పడిపోయారు. కొంతమంది అయితే తమకు నచ్చిన వాళ్లను సేవ్ చేసే క్రమంలో ఇదంతా కూడా బిగ్ బాస్ చేస్తున్న డ్రామా అని అంటున్నారు.

Also Read: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ ట్విస్ట్..!

ఇదిలా ఉంటే వాస్తవానికి అమ్మ రాజశేఖర్ మాస్టర్ గతవారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఆయనకే అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాలు నొప్పి కారణంగా అనూహ్యంగా నోయల్ ఎలిమినేట్ కావడం.. ఎవరినీ కూడా నామినేట్ చేయొద్దని కోరడంతో మాస్టర్ సేవ్ అయ్యారు. అలా తప్పించుకున్న మాస్టర్ ఈ వారం మళ్లీ నామినేషన్స్‌లోకి వచ్చారు. హారిక, అభిజిత్, మోనాల్, అవినాష్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీరందరిలో అమ్మ రాజశేఖర్ ఒక్కరే పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. దీనితో ఈ వారం మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss 4: ఇదీ సమంత సత్తా.. దసరా ఎపిసోడ్‌ టీఆర్పీ రేటింగ్‌ అదుర్స్..

సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం ఇంకో వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. మాస్టర్ కెప్టెన్‌ అయ్యారని.. దీనితో మరో రెండు వారాలు ఆయన ఎలిమినేషన్ నుంచి సేఫ్ అని భోగట్టా. కెప్టెన్ అయిన హౌస్‌మేట్ ఎలిమినేట్ కావడం చాలా అరుదు. గతంలో కూడా ఈ సందర్భాలు ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు మాస్టర్ విషయంలో కూడా అదే జరుగుతుందని.. నెక్స్ట్ వారం నామినేషన్ నుంచి మినహాయింపు కూడా ఉంటుందని అంటున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 2లో ముమైత్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడే సీక్రెట్ రూమ్‌కు వెళ్లడం.. ఆ తర్వాత ఎలిమినేట్ కావడం జరిగింది. మరి అదే ఫార్ములా మాస్టర్ విషయంలోనూ బిగ్ బాస్ ప్రయోగిస్తాడా.? లేదా. అనేది చూడాలి.

Also Read: చైతూకు విడాకులు ఇవ్వమన్న నెటిజన్‌కు.. సామ్ క్రేజీ కౌంటర్!