Bigg Boss 4: కెప్టెన్‌గా ‘మాస్టర్’ కొత్త రూల్స్‌.. షాకైన ఇంటి సభ్యులు

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా "రింగులో రంగు" అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్‌. ఇందులో కెప్టెన్సీ రేసులో ఉన్న హారిక‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ రింగులో క‌ళ్ల‌కు గంత‌లు కట్టుకున్నారు.

Bigg Boss 4: కెప్టెన్‌గా 'మాస్టర్' కొత్త రూల్స్‌.. షాకైన ఇంటి సభ్యులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 07, 2020 | 7:05 AM

Amma Rajasekhar Master: కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా “రింగులో రంగు” అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్‌. ఇందులో కెప్టెన్సీ రేసులో ఉన్న హారిక‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ రింగులో క‌ళ్ల‌కు గంత‌లు కట్టుకున్నారు. చేతిని రంగులో ముంచి ఒక‌రికి మ‌రొక‌రు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్ట‌ర్ హారిక మీద ప‌డి ఆమె టీషర్ట్‌ను రంగుతో నింపాడు. అరియానా మీద కూడా రంగు ప‌డింది. అస‌లు రంగు ప‌డ‌కుండా త‌ప్పించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్టర్‌ కెప్టెన్ అయ్యాడు. అంతే ఇక తన ప్రతాపాన్ని చూపడం స్టార్ట్ చేశాడు. అవినాష్‌ని రేష‌న్ మేనేజ‌ర్‌గా, అరియానాను త‌న‌ అసిస్టెంటుగా నియ‌మించుకున్నాడు. ( వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. “ఇక ఇలా చేయవచ్చు”)

ఆ తరువాత కొత్త రూల్స్‌ని పెట్టాడు. మైకు మ‌ర్చిపోతే జైలుకు పంపుతానన్నాడు. నిద్ర పోతే బెడ్‌రూమ్ మొత్తం శుభ్రం చేయాల‌ని ఆదేశించాడు. అలాగే ఇంగ్లీషులో మాట్లాడితే త‌న‌కు న‌చ్చినంత సేపు నిల‌బెడ‌తాన‌ని చెప్పాడు. మైకుల బ్యాట‌రీ కోసం బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు స్టోర్ రూమ్‌లోకి చిట్ట చివ‌ర వ‌చ్చిన‌వారి వారి గుడ్డు.. మొద‌ట అడుగు పెట్టిన వాళ్ల ఖాతాలోకి వెళుతుంద‌ని చెప్పుకొచ్చాడు. ఇక ఈ రూల్స్ చూసి హౌజ్‌లోని అందరూ షాక్‌కి గురయ్యారు. ( వచ్చింది పాతిక్కోట్లు.. మరి.. పోయింది..?)