వచ్చింది పాతిక్కోట్లు.. మరి.. పోయింది..?

కరోనా ఇచ్చిన గ్యాప్ ని కమర్షియల్ గా వాడుకోవడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందువరుసలో వున్నారు. ఎందుకంటే.. రీసెంట్ గా మహేష్ చేసినన్ని కమర్షియల్ యాడ్స్ మరే హీరో కూడా చెయ్యలేదన్నది ఫిలిం నగర్ టాక్. ఫిలిం నగర్ టాకేంటి.. మహేష్ కి సంబంధించి రిలీజైన లేటెస్ట్ ఫ్రెష్ లుక్స్ అన్నీ.. కలిపి చూస్తే.. ఈ విషయం క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఇంతకీ.. మహేష్ ఎంచుకున్న ఈ రూట్ ఆయనకు ప్లస్సా.. మైనస్సా? టీవీల్లో […]

వచ్చింది పాతిక్కోట్లు.. మరి.. పోయింది..?
Follow us

|

Updated on: Nov 07, 2020 | 12:16 AM

కరోనా ఇచ్చిన గ్యాప్ ని కమర్షియల్ గా వాడుకోవడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందువరుసలో వున్నారు. ఎందుకంటే.. రీసెంట్ గా మహేష్ చేసినన్ని కమర్షియల్ యాడ్స్ మరే హీరో కూడా చెయ్యలేదన్నది ఫిలిం నగర్ టాక్. ఫిలిం నగర్ టాకేంటి.. మహేష్ కి సంబంధించి రిలీజైన లేటెస్ట్ ఫ్రెష్ లుక్స్ అన్నీ.. కలిపి చూస్తే.. ఈ విషయం క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఇంతకీ.. మహేష్ ఎంచుకున్న ఈ రూట్ ఆయనకు ప్లస్సా.. మైనస్సా?

టీవీల్లో ఇరవై ముప్పై సెకన్ల కంటే ఎక్కువ సేపు కనిపించకపోయినా.. ఆ యాడ్ చేస్తే కోట్లల్లో సొమ్ములొస్తాయి. పైగా సూపర్ స్టార్ ఇమేజ్ వున్న మహేష్ కొచ్చే ఫ్యాన్సీ ఆఫర్స్ అయితే కళ్ళు బైర్లు గుమ్మే రేంజ్ లో ఉంటాయి. సరిలేరు నీకెవ్వరూ రిలీజ్ తర్వాత ఒకసారి ఫారిన్ ట్రిప్ వేసిన మహేష్.. తర్వాత మూడు నెలలు లాక్ డౌన్ అయ్యారు. మిగతా టైం మొత్తం.. ఏవేవో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గానే బిజీగా గడిపారు. జనవరి దాకా సర్కారువారి పాట షూట్ లేదు కనుక డిసెంబర్ వరకూ మరో రెండు యాడ్స్ కి కమిట్మెంట్స్ ఇచ్చారట. టోటల్ గా ఈ క్యాలెండర్లో పాతిక్కోట్ల దాకా వెనకేసుకున్నారట మహేష్. బాగానే గిట్టుబైటయిందిగా!

వచ్చిన పైసలెక్క అటుంచితే.. ఈ గ్యాప్ లో మహేష్ పోగొట్టుకున్నదేమీ లేదా? కచ్చితంగా వుంది. రకరకాల యాడ్స్ కోసం.. మేకోవర్ అవుతూ.. వాటికి సంబంధించిన బైటికి రిలీజ్ చేస్తూ.. నాన్ స్టాప్ గా లైమ్ లైట్ లో ఉండగలిగారు మహేష్. కానీ.. ఈ ఇన్ స్టెంట్ మెకోవర్స్ వల్ల మహేష్ తన ఒరిజినల్ ని పోగొట్టుకున్నారన్నది ఘట్టమనేని ఫాన్స్ ఫీలింగ్. చామింగ్ పర్సనాలిటీగా.. హంబుల్ గా కనిపించే మహేష్.. యాడ్స్ కోసం.. కాసేపు ముసలాడిగా.. మరికాసేపు చిన్న పిల్లాడిలా మారి.. కన్ ఫ్యుజ్ చేశారు. టోటల్ గా ప్రిన్స్ చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. మహేష్ లో గ్రేస్ తగ్గిందన్న కామెంట్లు కూడా వస్తున్నాయి.

Latest Articles
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం