పింక్‌ లెహెంగాలో తళుక్కుమన్న మృణాల్.. ఎన్ని రోజుల్లో డిజైన్‌ చేశారో తెలుసా?

May 08, 2024

TV9 Telugu

TV9 Telugu

మన అందాల తారలు ఫ్యాషన్‌ షోలు, ర్యాంప్‌వాక్‌లపై విభిన్న దుస్తులు ధరించి హొయలు ఒలకబోయడం కొత్తేం కాదు. అందుకే ఆయా ఈవెంట్లలో వారు ధరించే విభిన్న దుస్తులు ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకుంటాయి

TV9 Telugu

సాధారణంగా ఫ్యాషన్‌ షోలలో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన అందమైన దుస్తుల్ని ధరించి ర్యాంప్‌వాక్‌ చేస్తుంటారు సినీ తారలు. విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ని ప్రదర్శిస్తూ ఆయా లేబుల్స్‌కి షో స్టాపర్స్‌గా నిలుస్తుంటారు

TV9 Telugu

తాజాగా టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ అలాంటి అవుట్‌ఫిట్‌లోనే తళుక్కున మెరిసింది. ‘బాంబే టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ కోసం ఆమె ధరించిన లెహెంగా ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచింది

TV9 Telugu

మృణాల్‌ ధరించిన సంప్రదాయబద్ధమైన లెహెంగాను హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్‌ అను పెల్లకూరు రూపొందించింది. ‘స్వర్ణి రాహా’ పేరుతో దీనిని డిజైన్‌ చేసింది

TV9 Telugu

పింక్‌ కలర్‌ లెహెంగాపై భారీ ఎంబ్రాయిడరీతో హంగులద్దారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మేళవించేలా పువ్వులు, ఆకుల థీమ్‌తో ఈ లెహెంగాపై ఫ్లోరల్‌ మోటిఫ్స్‌ను రూపొందించింది

TV9 Telugu

గోల్డెన్‌ సిల్క్‌ దారాలు, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఈ భారీ లెహెంగాకు జతగా ప్లంజింగ్‌ నెక్‌లైన్‌ బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేశారు. ఇక దీనికి అనుసంధానించిన బటర్‌ఫ్లై హెమింగ్‌ బ్లౌజ్‌ హైలైట్‌గా నిలిచింది

TV9 Telugu

హెవీ ఎంబ్రాయిడరీ లెహెంగా ధరించిన మృణాల్‌ మ్యాచింగ్‌ కలర్‌, మ్యాచింగ్‌ ఎంబ్రాయిడరీ షీర్‌ దుపట్టాతో మెరుపులు మెరిపించింది.  ఈ లవ్లీ లెహెంగాను రూపొందించడానికి ఏకంగా 1400 గంటల సమయం పట్టిందట! 

TV9 Telugu

ఇక దీనిని ధరించిన మృణాల్‌ సీతాకోక చిలుకలా మెరిసిపోయింది. లెహెంగా డిజైనర్‌ అనుతో కలిసి మృణాల్‌ ర్యాంప్‌వాక్‌ చేసి, ఫొటోలకు ఫోజులిచ్చింది