- Telugu News Photo Gallery Cinema photos Movies shooting update in Tollywood on 08 May 2024 Telugu Entertainment Photos
Entertainment: ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే..
అల్లు అర్జున్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఆర్య. సకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆర్య రోజులను గుర్తుచేసుకున్నారు అల్లు అర్జున్. ''ఆర్యకి 20 ఏళ్లు. ఇది కేవలం సినిమా విడుదల తేదీ మాత్రమే కాదు. నా జీవితాన్ని మార్చిన క్షణం. ఎప్పటికీ రుణపడి ఉంటాను'' అని అన్నారు బన్నీ. అల్లు అర్జున్ వల్లే ఆర్య సాధ్యమైందని సుకుమార్ చెప్పారు. సిద్ధార్థ్ పరిచయం కావడం వల్ల ప్రేమపై తనకు నమ్మకం పెరిగిందని అన్నారు నటి అదితిరావు హైదరి.
Updated on: May 08, 2024 | 8:28 PM

అల్లు అర్జున్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఆర్య. సకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆర్య రోజులను గుర్తుచేసుకున్నారు అల్లు అర్జున్. ''ఆర్యకి 20 ఏళ్లు. ఇది కేవలం సినిమా విడుదల తేదీ మాత్రమే కాదు.

నా జీవితాన్ని మార్చిన క్షణం. ఎప్పటికీ రుణపడి ఉంటాను'' అని అన్నారు బన్నీ. అల్లు అర్జున్ వల్లే ఆర్య సాధ్యమైందని సుకుమార్ చెప్పారు.

సిద్ధార్థ్ పరిచయం కావడం వల్ల ప్రేమపై తనకు నమ్మకం పెరిగిందని అన్నారు నటి అదితిరావు హైదరి. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించకూడదని కోరారు అదితిరావు.

భలే ఉన్నాడే సినిమా మంచి కంటెంట్‌తో వస్తోందని అన్నారు డైరక్టర్ మారుతి. భలే ఉన్నాడే టీజర్‌ని ఆయన విడుదల చేశారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ఇది. రాజ్‌తరుణ్‌తో మంచి ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, చిన్న సినిమాలు ఆడితే ఆ కిక్కే వేరని అన్నారు మారుతి.

రాహుల్, చేతన్, యమీ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 100 కోట్లు. సంగీత దర్శకుడు సాయికార్తిక్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. నిర్మాతలు దామోదరప్రసాద్, హర్షిత్ రెడ్డి, దర్శకులు వీరశంకర్, మల్లిక్‌రామ్ తదితరులు పాల్గొని ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 2016లో జరిగిన యథార్థ కథతో తెరకెక్కించామని అన్నారు సాయి కార్తిక్.

ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా రాయన్. సన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంటల మధ్య ఉన్న ఇటుకలపై కూర్చుని సీరియస్‌గా చూస్తున్న ధనుష్ పిక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని గురువారం విడుదల చేయనున్నారు మేకర్స్.




