- Telugu News Photo Gallery Cinema photos Actress Ileana D'Cruz Remembering her movies days in Tollywood
Ileana D’Cruz: బంగారం.. మిస్ అవుతున్నా.! గోల్డెన్ డేస్ ని గుర్తుచేసుకున్న గోవా బ్యూటీ.
బంగారం.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా బంగారం..! అని అంటున్నారు ఇలియానా. యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ మాటల్నే చెప్పకపోయినా, ఆమె మాటలు విన్న ఎవరికైనా మిస్ అవుతున్నారనే ఫీలింగ్ కనిపిస్తుంది. నిజంగా మిస్ అయ్యే ఉంటారులే.. కాకపోతే ఉన్నట్టుండి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసినట్టు అనే అనుమానాలు ఆడియన్స్ కి కూడా వస్తాయి.. ఇంతకీ ఇలియానా మిస్ అవుతున్నది ఎవరినీ అంటారా.?
Updated on: May 09, 2024 | 8:08 AM

బంగారం.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా బంగారం..! అని అంటున్నారు ఇలియానా. యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ మాటల్నే చెప్పకపోయినా, ఆమె మాటలు విన్న ఎవరికైనా మిస్ అవుతున్నారనే ఫీలింగ్ కనిపిస్తుంది.

నిజంగా మిస్ అయ్యే ఉంటారులే.. కాకపోతే ఉన్నట్టుండి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసినట్టు అనే అనుమానాలు ఆడియన్స్ కి కూడా వస్తాయి.. ఇంతకీ ఇలియానా మిస్ అవుతున్నది ఎవరినీ అంటారా.?

మనల్నేనండోయ్.. నార్త్ హీరోయిన్లందరూ సౌత్‌లో జల్సా చేసుకోవడానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పట్టుకుంటుంటే, ఇప్పుడు తాపీగా సౌత్‌ని గుర్తుచేసుకుంటున్నారు ఇలియానా.

సౌత్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే నార్త్ కి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని రీకాల్ చేసుకుంటున్నారు. దేవదాస్‌తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఇల్లీబేబీ వరుసగా టాప్ హీరోలు అందరితోనూ నటించారు.

యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు చాలానే చేశారు. ఆ టైమ్‌లోనే ఆమెకు బాలీవుడ్ నుంచి బర్ఫీ మూవీ ఆఫర్ వచ్చింది. ఆ సినిమాకి సైన్ చేయడం వల్లనే సౌత్ కెరీర్ డ్రాప్ అయిందని అన్నారు గోవాబ్యూటీ.

బాబుకు జన్మనిచ్చాక మళ్లీ యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇప్పటిలా గతంలో ప్యాన్ ఇండియా కల్చర్ లేదని, అప్పట్లో తనకు నార్త్ లో వరుసగా అవకాశాలు రావడంతో..,

ఇక సౌత్‌కి దూరమయ్యానని మేకర్స్ అపోహపడ్డారని ఓపెన్ అయ్యారు ఇలియానా. ఒక్క ఛాన్స్ ఇస్తే, రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అన్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ భామలో.




