- Telugu News Photo Gallery Heart Healthy Foods: Heart Attack Risk Can Reduce By Dry Fruits And Coffee
Heart-Healthy Foods: గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి.. తప్పక తీసుకోండి!
విపరీతమైన వేడిలో పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. పైగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచుతాయి. దీని ఫలితంగా సిరలు, ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. దీని ప్రభావం గుండె నుంచి మెదడు వరకు ఉంటుంది. సిరలు, ధమనులలో అడ్డుపడటం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి తీవ్రమైన శారీరక సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. వీటిని నివారించాలంటే ఆహారం విషయంలో..
Updated on: May 08, 2024 | 8:33 PM

విపరీతమైన వేడిలో పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. పైగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచుతాయి. దీని ఫలితంగా సిరలు, ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. దీని ప్రభావం గుండె నుంచి మెదడు వరకు ఉంటుంది. సిరలు, ధమనులలో అడ్డుపడటం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి తీవ్రమైన శారీరక సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. వీటిని నివారించాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.

జంక్ ఫుడ్ లేదా ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల సిరలు, ధమనులలో అడ్డుపడటానికి దారితీస్తుంది. కొన్ని సాధారణ పండ్లు, పానీయాలతో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. తద్వారా అడ్డంకులను నివారించవచ్చు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రై ఫ్రూట్స్ సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పిస్తా, జీడిపప్పు, అంజీర పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సిరలు, ధమనులలో అడ్డంకుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి వేడి వాతావరణంలో ప్రతిరోజూ ఎండుద్రాక్షను తక్కువ మొత్తంలో తినడం అలవాటు చేసుకోవాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మరో ముఖ్యమైన పండు స్ట్రాబెర్రీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అందుకే గుండె ఆగిపోకుండా ఉండటానికి స్ట్రాబెర్రీలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన మరో పండు అవకాడో. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా, ఈ పండును ఆహారంలో తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే దానిమ్మ కూడా గుండె ఆరోగ్యాన్ని వెయ్యింతలు కాపాడుతుంది.

చాలా మంది టీ, కాఫీలు తాగడం అలవాటు. అయితే వేసవిలో టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదని చాలామంది అభిప్రాయ పడుతుంటారు. అయితే టీ, కాఫీలలో ఉండే కెఫిన్ నరాలను ఉత్తేజపరచడమే కాకుండా, సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజూ కొంత మొత్తంలో కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.





























