Watch Video: ఆ విషయంలో రేవంత్, కేసీఆర్‌లకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్, KCRకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్, KCRకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పదేపదే పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. అబద్దాలతో బీజేపీని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం మాట్లాడుతుండటం సరికాదన్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో ప్రజలు కాంగ్రెస్ నేతల మాటలు నమ్మడం లేదన్నారు. బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి మెజార్టీ స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీకి ప్రజా మద్ధతు పెరుగుతుండటంతో సీఎం రేవంత్‌కు అసహనం పెరిగిపోయిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరిచారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన రూ.9 లక్షల కోట్లు గాడిద గుడ్డులా కనిపిస్తున్నాయా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ గాడిద గుడ్డు రైతుల నెత్తిన పెట్టారంటూ మండిపడ్డారు.
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

