వివేక హత్య కేసుపై స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..

వివేక హత్య కేసుపై స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..

Srikar T

|

Updated on: May 09, 2024 | 7:21 AM

చరిత్ర సృష్టించేందుకే దేవుడు తనకు సీఎం పదవి ఇచ్చారని జగన్‌ తెలిపారు. పేదల జీవితాలు మార్చేందుకు తాను కృషి చేస్తున్నానని అన్నారు. చనిపోయిన తర్వాత కూదా ప్రతీ పేదవాని గుండెల్లో నిలిచిపోవాలన్నది తన జీవిత లక్ష్యమని అని తెలిపారు. తన సోదరి సునీత చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదని జగన్‌ విస్పష్టంగా చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌ రెడ్డి చెప్తున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారని జగన్ తెలిపారు. కడప ప్రజలకు అవినాష్‌ రెడ్డి ఎలాంటి వాడో తెలుసని అన్నారు.

చరిత్ర సృష్టించేందుకే దేవుడు తనకు సీఎం పదవి ఇచ్చారని జగన్‌ తెలిపారు. పేదల జీవితాలు మార్చేందుకు తాను కృషి చేస్తున్నానని అన్నారు. చనిపోయిన తర్వాత కూదా ప్రతీ పేదవాని గుండెల్లో నిలిచిపోవాలన్నది తన జీవిత లక్ష్యమని అని తెలిపారు. తన సోదరి సునీత చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదని జగన్‌ విస్పష్టంగా చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌ రెడ్డి చెప్తున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారని జగన్ తెలిపారు. కడప ప్రజలకు అవినాష్‌ రెడ్డి ఎలాంటి వాడో తెలుసని అన్నారు. బాబాయ్‌ హత్యా కేసును ఒక రాజకీయ అంశంగా మార్చి, రాజకీయంగా ఒక వ్యాక్యూమ్ సృష్టించే ప్రయత్నం చేశారని జగన్‌ అన్నారు. కేసును తప్పుదారి పట్టిస్తూ వాళ్లే కోర్టును ఆశ్రయించారని వివరించారు. ఈ ఎన్నికను కడప సెంట్రిక్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వివేకానందరెడ్డి రెండో భార్య, ఆమె కొడుకు కోణంలో ఎందుకు విచారణ జరపడం లేదని అవినాష్‌ రెడ్డి అడుగుతున్న దాంట్లో తప్పేముందని సీఎం జగన్‌ అన్నారు. అవినాష్‌ చెప్తున్న విషయాలను తాను నమ్ముతున్నానని జగన్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: May 09, 2024 07:02 AM