Watch Video: 'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..

Watch Video: ‘ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు’.. పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..

Srikar T

|

Updated on: May 09, 2024 | 1:50 PM

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపించారు వైసీపీ నేత పోతిన మహేష్‌. ఆస్తుల కోసమే పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారన్నారు. ఒకప్పుడు కారుకు EMI కట్టలేని పవన్‌.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారాయన. నమ్ముకున్న వాళ్లను అమ్ముకొని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులను కూడా పవన్‌ తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్‌. మంగళగిరిలో వందకోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు పోతిన మహేష్‌.

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపించారు వైసీపీ నేత పోతిన మహేష్‌. ఆస్తుల కోసమే పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారన్నారు. ఒకప్పుడు కారుకు EMI కట్టలేని పవన్‌.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారాయన. నమ్ముకున్న వాళ్లను అమ్ముకొని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులను కూడా పవన్‌ తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్‌. మంగళగిరిలో వందకోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు పోతిన మహేష్‌. అంత డబ్బు ఎలా వచ్చిందో పవన్‌ లెక్క చెప్పాలని సవాల్‌ విసిరారు. బినామీ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారాయన.

పవన్‌ కల్యాణ్‌ బినామీ బాగోతాలన్ని ప్రజల ముందుకు తీసుకు వస్తామన్నారు పోతిన మహేష్‌. కుటుంబసభ్యులతో పాటు మరికొందరు పవన్‌ బినామీలుగా ఉన్నారన్నారు. పవన్‌ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాపు కమ్యూనిటీ ఇచ్చిన విరాళాలను కూడా పవన్‌ కల్యాణ్‌ స్వాహా చేశారని ఆరోపించారు పోతిన మహేష్‌. ఎలా ఖర్చు చేశారని అడిగిన వాళ్లను దూరంపెట్టారన్నారు. రంగారెడ్డి జిల్లాలోని పవన్‌ కల్యాణ్‌ ఫామ్‌హౌజ్‌ మాటున పెద్ద గూడుపుఠాని వుందన్నారు. అఫిడవిట్‌లో ఆయన చెప్పిన లెక్కకన్నా ఆయన కొన్న భూమి ఎక్కువన్నారు. అంత డబ్బు ఎలా వచ్చిందో పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబసభ్యులు సహా మరికొందరిపై పవన్‌ బినామీ ఆస్తులన్నాయంటూ డాక్యుమెంట్లు బయటపెట్టారు పోతిన మహేష్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..