08 May 2024
మెగా హీరోతో ఆ సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకున్న శివానీ రాజశేఖర్..
Rajitha Chanti
Pic credit - Instagram
హీరో రాజశేఖర్ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2 స్టేట్స్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది.
ఆ తర్వాత అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. చివరగా కోట బొమ్మాళి పీఎస్ సినిమాతో హిట్ కొట్టింది.
తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ శివానీ ఓ హిట్ మూవీని మిస్ అయ్యిందట.
అదే ఉప్పెన. ఈ మూవీ స్టోరీ ముందుగా తన వద్దకే వచ్చిందట. ముందు తనకు చెప్పినప్పుడు బోల్డ్, రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయట.
అవి కాస్త అన్ కంఫర్టబుల్ గా అనిపించడంతో ఉప్పెన కథను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఒకవేళ చేసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది.
ఉప్పెన సినిమాను శివానీ చేసి ఉంటే ఇప్పుడు ఆమె రేంజ్ మారిపోయేదని.. కెరీర్ పీక్స్ కు వెళ్లేది అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో శివానీ రాజశేఖర్ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది
ఇక్కడ క్లిక్ చేయండి.