AP News: నల్లజర్లలో దాడి ఘటనపై తానేటి వనిత నిరసన..
నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు. దాడి ఘటనపై తాజాగా ఆమె నిరసనకు దిగారు....
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించడంతో అప్రమత్తమైన హోంమంత్రి సెక్యూరిటీ దాడి నుంచి కాపాడారు. రాత్రి ప్రచారం ముగించుకుని వైసీపీ నేత సుబ్రమణ్యం ఇంటికి వచ్చిన టైమ్‌లో ఈ అటాక్ జరిగింది. పలు వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా నల్లజర్లలో పోలీసులు భారీగా మోహరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హోంమంత్రి వనితపై దాడికి యత్నం ఘటనలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అభ్యర్థి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు సహా వైసీపీకి చెందిన కారుమంచి రమేష్, ప్రసాద్‌పై SC, ST అట్రాసిటీ, సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. కాగా నల్లజర్లలో దాడి ఘటనపై తానేటి వనిత నిరసనకు దిగారు. కార్యకర్తలతో కలిసి బైఠాయించి.. టీడీపీ నేతల దాడులు నశించాలి అని ఫ్లకార్డులు ప్రదర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…