Bigg Boss 4: కెప్టెన్ అంటే హిట్లర్‌ డ్యూటీ కాదు.. ‘అమ్మ’పై హారిక ఫైర్

కొత్త కెప్టెన్ అమ్మ రాజశేఖర్ఇంటి సభ్యులకు వర్క్ డివైడ్ చేశారు. సొహైల్, అభిజిత్, అఖిల్‌లు ముగ్గురూ ఉదయం టిఫిన్ చేయాలని అలాగే కిచెన్‌ని క్లీన్ చేసి పెట్టాలని చెప్పారు

Bigg Boss 4: కెప్టెన్ అంటే హిట్లర్‌ డ్యూటీ కాదు.. 'అమ్మ'పై హారిక ఫైర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 07, 2020 | 8:04 AM

Bigg Boss 4 Telugu: కొత్త కెప్టెన్ అమ్మ రాజశేఖర్ఇంటి సభ్యులకు వర్క్ డివైడ్ చేశారు. సొహైల్, అభిజిత్, అఖిల్‌లు ముగ్గురూ ఉదయం టిఫిన్ చేయాలని అలాగే కిచెన్‌ని క్లీన్ చేసి పెట్టాలని చెప్పారు. ఇక మధ్యాహ్నం లాస్య, హారిక, మోనాల్ ముగ్గురు లంచ్ ప్రిపేర్ చేయాలని మాస్టర్ చెప్పగా.. వారు ఓకే అన్నారు. ఇక మార్నింగ్ టిఫిన్ చేసిన వాళ్లే నైట్ కూడా డిన్నర్ చేస్తారని అమ్మ చెప్పాడు. ఇక వీళ్లందరికీ అరియానా అసిస్టెంట్‌గా ఉంటుందని వివరించారు. ఆమె ఇంట్లో ఎవరు ఏం చేయకపోయినా తనకు చెప్తుందని, అసిస్టెంట్ లేకపోతే తనకి పని అవ్వదు కాబట్టే.. అరియానాను అసిస్టెంట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం కిచెన్ డ్యూటీ ఉన్నవాళ్లే ఉదయం, రాత్రి క్లీనింగ్ చూసుకోవాలని చెప్పాడు. ( దివ్య హత్య కేసు: 20 రోజుల తరువాత నిందితుడు నాగేంద్ర అరెస్ట్‌)

ఇక మెహబూబ్, అవినాష్‌లు బాత్ రూంలు క్లీన్ చేయాలని ఆదేశించారు. అయితే మాస్టర్ చెప్పిన రూల్స్‌ని విన్న అభి.. మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బావుంది కానీ.. పొద్దున్న కలుద్దాం అని చెప్పాడు. హారిక అయితే ఈ రూల్స్‌ని నేను ఒప్పుకోను అంటూ గొడవకు దిగింది. అందర్నీ సమానంగా చూడాలి. కెప్టెన్ అంటే హిట్లర్ డ్యూటీ కాదు అంటూ హారిక మండిపడింది. దీంతో హౌజ్‌లో పెద్ద రభస చోటు చేసుకోవడంతో మెహబూబ్‌, అవినాష్ మరికొన్ని పనులు చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇది నచ్చని మాస్టర్‌.. మెహబూబ్‌, అవినాష్‌లకు క్లాస్ పీకాడు. వేరే పనులు చేస్తామని ఎందుకు ఒప్పుకున్నారని మండిపడ్డాడు. చూస్తుంటే కెప్టెన్‌గా ఎన్నికైన తరువాత మాస్టర్ కాస్త ఓవర్‌ చేసినట్లుగా అనిపించింది. ( బీహార్ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం)