దివ్య హత్య కేసు: 20 రోజుల తరువాత నిందితుడు నాగేంద్ర అరెస్ట్
విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో నిందితుడు నాగేంద్రను 20 రోజుల తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Police Arrests Nagendra: విజయవాడలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను 20 రోజుల తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపర చిక్కులతో అతడి అరెస్ట్ ఆలస్యం కాగా.. ప్రస్తుతం నాగేంద్రను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలను దిశా టీమ్ రాబడుతుంది. ( బీహార్ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం)
నాగేంద్ర వెల్లడించిన ఆరుమంది స్నేహితులను కూడా ప్రత్యేక బృందం ఇంటరాగేట్ చేయనుంది. హత్య కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలను సేకరించిన టీమ్.. చార్జిషీట్ ,రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది. ఈ రోజు నాగేంద్రను మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు. సమగ్ర విచారణ కోసం వారం రోజుల పాటు అతడిని కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ( Bigg Boss 4: కెప్టెన్‌గా ‘మాస్టర్’ కొత్త రూల్స్.. షాకైన ఇంటి సభ్యులు)