ఈ క్రూయిజ్‌‎లు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనవి!

25 April 2025

Prudvi Battula 

ది సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్ - ఈ క్రూయిజ్ మిమ్మల్ని కరేబియన్, అలాస్కా, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళుతుంది.

ఈ క్రూయిజ్ ప్రయాణ ధర ఒక్కొక్కరికి కనిష్టంగా రూ.54 వేల నుండి ప్రారంభమై గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఉంటుంది.

క్రిస్టల్ సెరినిటీ క్రూయిసెస్ - దక్షిణ పసిఫిక్, యూరోపియన్ నదులు, అలాస్కా మరియు అంటార్కిటికాలో ప్రయాణించండి.

క్రిస్టల్ సెరినిటీ క్రూయిజ్‌లో ఒక వ్యక్తికి టికెట్ ధర విషయానికి వస్తే.. రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు ఉంటుంది.

రిట్జ్-కార్ల్టన్ క్రూయిసెస్ -ఈ క్రూయిజ్‌ కరేబియన్, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికా దేశాల మధ్య ప్రయాణిస్తుంది.

ఈ విలాసవంతమైన క్రూయిజ్‌లో ప్రయాణం కోసం ఒక వ్యక్తికి కరేబియన్‌కు వారానికి టికెట్ ధర దాదాపు రూ.4 లక్షలు ఉంటుంది.

ఓషియానియా మెరీనా క్రూయిజ్‌ -ఇది యూరప్, ఆసియా, ఓషియానియా, అమెరికాల దేశాలకు మధ్య ప్రయాణాన్ని అందిస్తుంది.

ఓషియానియా మెరీనాలో ప్రయాణానికి 12 రాత్రుల దక్షిణ అమెరికా క్రూయిజ్ దాదాపు రూ.3 లక్షల నుండి ప్రారంభమవుతుంది.