AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?

Shubman Gill Breaks Silence on Dating Rumors: టీం ఇండియా కాబోయే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఇటీవల అనేక మంది నటీమణులతో డేటింగ్ రూమర్‌ల గురించి బహిరంగంగా మాట్లాడారు. తాను మూడు సంవత్సరాలకు ఒంటరిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో అతని అద్భుతమైన ప్రదర్శనతో ఈ పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గిల్ ఒకే ఒక్క ప్రకటనతో ఈ పుకార్లకు ముగింపు పలికాడు.

Video: సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
Shubman Gill And Sara Tendulkar
Venkata Chari
|

Updated on: Apr 27, 2025 | 7:58 AM

Share

Shubman Gill Breaks Silence on Dating Rumors: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ తన ఆటతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా, గిల్ పేరు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ముడిపడి ఉంది. కానీ, వీరిద్దరూ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత, ఇద్దరూ విడిపోయారని పుకార్లు వ్యాపించాయి. వీటన్నింటి మధ్య, శుభ్‌మాన్ గిల్ మొదటిసారిగా ఊహాగానాలపై తన మౌనాన్ని వీడాడు.

3 సంవత్సరాలుగా నేను సింగిల్..

సారా టెండూల్కర్ కాకుండా, రిద్దిమా పండిట్, అనన్య పాండే, సోనమ్ బజ్వా, అవనీత్ కౌర్ వంటి అనేక మంది నటీమణులతో శుభ్‌మాన్ గిల్ పేరు తరచుగా వినిపిస్తుంది. అయితే, శుభ్‌మాన్ గిల్ ఇప్పుడు ఈ విషయంపై తన మౌనాన్ని వీడాడు. ‘నేను 3 సంవత్సరాలకు పైగా ఒంటరిగా ఉన్నాను. అయితే, వారు నా పేరును వేర్వేరు అమ్మాయిలతో ముడిపెట్టి పుకార్లు సృష్టించారు. ఎందుకంటే, నాతో సంబంధం ఉన్న ఎవరినీ నేను ఎప్పుడూ చూడలేదు లేదా కలవలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఒక్క ప్రకటనతో పుకార్లకు ముగింపు..

తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని స్పష్టం చేశాడు. అయితే, కొంతకాలం క్రితం, శుభ్‌మాన్ అవనీత్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు, అవనీత్, శుభ్‌మాన్ తమ స్నేహితులతో సెలవులను ఎంజాయ్ చేశారు. ఇది మాత్రమే కాదు, టీమిండియా మ్యాచ్‌లను చూసేందుకు అవనీత్ కూడా చాలాసార్లు స్టేడియంలో కనిపించింది.

ఐపీఎల్ 2025లో గిల్ ప్రదర్శన..

శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతని నాయకత్వంలో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచి, 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. అదే సమయంలో, గిల్ 43.57 సగటుతో 305 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..