AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civils 2025: యూపీఎస్సీ, గ్రూప్‌ 1లో ఎస్సీ స్టడీసర్కిల్‌ అభ్యర్థుల సత్తా.. మొత్తం ఎంత మంది సెలక్టయ్యారో తెలుసా?

తాజాగా విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన ఇద్దరు అభ్యర్ధులు ప్రతిభ చాటారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్‌ క్షితిజ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు గ్రూప్ 1 ఫలితాల్లోనూ వందలోపు ర్యాంకులు దాదాపు 35 నుంచి 40 మంది సాధించారు..

UPSC Civils 2025: యూపీఎస్సీ, గ్రూప్‌ 1లో ఎస్సీ స్టడీసర్కిల్‌ అభ్యర్థుల సత్తా.. మొత్తం ఎంత మంది సెలక్టయ్యారో తెలుసా?
Telangana SC Study Circles
Srilakshmi C
|

Updated on: Apr 27, 2025 | 8:22 AM

Share

హైదరాబాద్, ఏప్రిల్ 27: రాష్ట్రంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్‌లలో యేటా పోటీ పరీక్షలకు ఉచితంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాల్లో ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన ఇద్దరు అభ్యర్ధులు ప్రతిభ చాటారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్‌ క్షితిజ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌లో గోకమల్ల ఆంజనేయులుకు 934 ర్యాంకు, రాంటెంకి సుధాకర్‌ 949వ ర్యాంకులు పొందారు. వీరు ఐఆర్‌ఎస్‌ పొందే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఎస్సీ స్టడీ సెంటర్‌లో శిక్షణ పొందిన అభ్యర్ధుల్లో 27 మంది సివిల్స్‌ ప్రిలిమినరీలో అర్హత సాధించి ప్రధాన పరీక్షలు రాయగా, వారిలో ముగ్గురు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరు పోస్టులు సాధించారు.

ఇక ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌ 1 ఫలితాల్లో శిక్షణ పొందిన వారిలో 35 నుంచి 40 మంది పోస్టులకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. వారిలో బి వనజ 38వ ర్యాంకు, మేరీగోల్డ్‌ 56వ ర్యాంకు, ఎం.రవితేజ 66వ ర్యాంకు, కిషన్‌పటేల్‌ 72వ ర్యాంకు, ఇ.రాకేష్‌ 78వ ర్యాంకు, బి.శ్రావణ్‌ 84వ ర్యాంకుల్లో మెరిశారని కమిషనర్‌ క్షితిజ తెలిపారు.

ఎన్‌సీఈటీ-2025 అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల.. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష

ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ-2025) ప్రవేశాలకు సంబంధించి 2025-26 విద్యా సంత్సరానికి నేషనల్ కామన్‌ ఎంట్రెన్స్ టెస్ట్‌-2025 ఏప్రిల్‌ 29వ తేదీన నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్ష హాల్‌టికెట్స్‌ను ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది. ఈ మేరకు అడ్మిట్‌ కార్డ్స్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఆర్‌ఐఈల్లో ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎన్‌సీఈటీ-2025 అడ్మిట్‌ కార్డ్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.