AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: రెండో అంతస్తు నుంచి కుక్కను తోసి చంపిన డాక్టర్.. కట్‌ చేస్తే.. షాక్ ఇచ్చిన పోలీసులు!

తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి ఓ కుక్కను తోసి చంపేశాడనే ఆరోపణలతో బెంగళూరుకు చెందిన ఓ ( 33) ఏళ్ల వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వైద్యుడు గతంలోనూ కుక్కల మరణానికి కారణమయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అతనిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Bengaluru: రెండో అంతస్తు నుంచి కుక్కను తోసి చంపిన డాక్టర్.. కట్‌ చేస్తే.. షాక్ ఇచ్చిన పోలీసులు!
Bengaluru Case
Anand T
|

Updated on: Apr 26, 2025 | 11:54 AM

Share

ప్రస్తుత కాలంలో కొందరు లక్షలు ఖర్చు పెట్టి కుక్కలను పెంచుకుంటున్నారు. పిల్లలో సమానంగా వాటిని కూడా చూసుకుంటున్నారు. అలాంటి వారు వాటికి ఏమైనా అయితే అస్సులు తట్టుకోలేరు. కానీ కొందరు మాత్రం వాటిని చూస్తేనే కోపంతో రగిలిపోతుంటారు. వాటిపై పగలు పెంచుకొని అంతమొందిచేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. తన ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నుంచి ఓ వైద్యుడు కుక్కను తోసి చంపాడనే 22 ఏళ్ల విద్యార్థి ఆయుష్ బెనర్జీ ఫిర్యాదుతో అడుగోడి పోలీసులు ఏప్రిల్ 22న బల్లాల్ అనే వైద్యుడి పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 325 (జంతువును చంపడం) కింద కేసు నమోదు చేశారు.

స్థానికుల వివరాల ప్రకారం.

అయితే ఈ వైద్యుడు గతంలోనూ స్కూబీ అనే కుక్కను ఇదే విధంగా పై అంతస్తు నుండి విసిరివేసినట్లు స్థానికులు ఆరోపించారు. “ఫిబ్రవరి 5న, తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కుక్క అరుపులు విన్న తాము బయటకు వచ్చి చూడగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గాయాలతో పడి ఉన్న కుక్క కనింపించిందని.. దానిని వెంటనే బెంగళూరులోని ఒక వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లిన్నట్టు తెలిపారు. ఆకుక్కను పరీక్షించిన వైద్యులు దాని వెన్నెముక విరిగిందని, ఇతర గాయాలు కూడా అయ్యాయని చెప్పినట్టు తెలిపారు. అయితే ఆ కుక్క పై నుంచి పడిన సమయంలో వైద్యుడు బల్లాల్  తన అపార్ట్‌మెంట్‌ వద్ద కనిపించాడని..వెంటనే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లినా అతని స్పందించలేదని తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేకపోవడంతో అప్పుడు పోలీసులను సంప్రదించలేదని ఓ స్థానికుడు చెప్పాడు.

అయితే తాజాగా ఏప్రిల్ 20న, తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ అలాంటి ఓ పెద్ద శబ్దమే తనకు వినిపించిందని..బయటకు వచ్చి చూడగా గ్రౌండ్‌ ప్లోర్‌లో పార్క్‌ చేసి ఉన్న కారుపై కుక్క పడిపోయి ఉందని తెలిపారు.  దాని తలకు తీవ్ర గాయం కావడంతో ఆ కుక్క చనిపోయినట్టు స్థానికుడు చెప్పాడు. అయితే 2022లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా బల్లాల్ ఓ వీధికుక్క మృతికి కారణమయ్యాడని పోలీసులు కనుగొన్నారు. ఆగస్టు 7, 2022న జరిగిన ఈ వీధి కుక్క మరణానికి బల్లాల్ కారణమని ఆరోపిస్తూ, పీపుల్ ఫర్ యానిమల్స్ అనే ఎన్జీఓ అతనిపై ఇండోర్‌లోని పలాసియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం…

బెంగళూరు లక్కసంద్రలోని బృందావన్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న న్యూరో సర్జన్ డాక్టర్ సాగర్ బల్లాల్‌ ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ వ్యక్తికి చెందిన కుక్కను రెండో అంతస్తు నుంచి తోసేసి చంపారని తమకు ఫిర్యాదు వచ్చినట్టు తెలిపారు. తాము నిందితుడిని విచారణకు పిలిచి విచారించగా తనపై మోపిన అభియోగాలను అతను ఖండించాడని అడుగోడి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. కారు పార్కింగ్ విషయంలో తన పొరుగువారితో విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని డాక్టర్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…