Bigg Boss 4:నీ ఫ్రెండ్‌షిప్ వద్దన్న మెహబూబ్.. సొహైల్‌కి కట్టలు తెంచుకున్న కోపం
కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్ హౌజ్‌లో కొత్త రూల్స్ పెట్టాడు. ఇక ఈ రూల్స్‌పై ఇంటి సభ్యుల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో హౌజ్‌లో పెద్ద రచ్చనే జరిగింది.
Bigg Boss 4 Sohail: కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్ హౌజ్‌లో కొత్త రూల్స్ పెట్టాడు. ఇక ఈ రూల్స్‌పై ఇంటి సభ్యుల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో హౌజ్‌లో పెద్ద రచ్చనే జరిగింది. ఇక ఈ రూల్స్ వలన సొహైల్, మెహబూబ్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే వాటిని చాలా తేలికగా తీసుకున్న సొహైల్.. తన స్నేహితుడు మెహబూబ్ కోసం చాక్లెట్ తీసుకెళ్లాడు. కానీ మెహబూబ్ మాత్రం నీ ఫ్రెండ్‌షిప్ వద్దు, ఏం వద్దు, నా ఆట నేను ఆడుకుంటా అని అనేశాడు. దాంతో సొహైల్‌కి కోపం కట్టలు తెంచుకుంది. చేతికి అందిన వస్తువునల్లా విసిరిపారేశాడు. దీంతో అఖిల్, సొహైల్ వద్దకు వెళ్లి బుజ్జగించి, ఇద్దరి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు.
Read More:
Bigg Boss 4: కెప్టెన్ అంటే హిట్లర్ డ్యూటీ కాదు.. ‘అమ్మ’పై హారిక ఫైర్
దివ్య హత్య కేసు: 20 రోజుల తరువాత నిందితుడు నాగేంద్ర అరెస్ట్