బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!
బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 తొమ్మిదో వారం చివరికి వచ్చింది. ఈ వారం అమ్మ రాజశేఖర్‌ను హౌస్ నుంచి పంపించేసినట్లు విశ్వసనీయ వర్గాల...
Bigg Boss 4: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 తొమ్మిదో వారం చివరికి వచ్చింది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా అమ్మ రాజశేఖర్‌ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ తొమ్మిది వారంలో అభిజిత్, హారిక, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అమ్మ రాజశేఖర్, మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక అందరి కంటే తక్కువ ఓట్లు అమ్మ రాజశేఖర్‌కి వచ్చాయని వినికిడి.
గత రెండు వారాలుగా అమ్మ రాజశేఖర్ ఒక్కరే పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. టాస్కులు గానీ హౌస్‌లో మిగిలిన విషయాల్లో గానీ ఆయన ఇతర కంటెస్టెంట్లతో ప్రవర్తించే తీరు అభిమానులకు నచ్చట్లేదు. అంతేకాదు వాస్తవానికి అమ్మ రాజశేఖర్ మాస్టర్ గతవారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఆయనకే అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాలు నొప్పి కారణంగా అనూహ్యంగా నోయల్ ఎలిమినేట్ కావడం.. ఎవరినీ కూడా నామినేట్ చేయొద్దని కోరడంతో మాస్టర్ సేవ్ అయ్యారు. అలా తప్పించుకున్న మాస్టర్ ఈ వారం మళ్లీ నామినేషన్స్‌లోకి వచ్చి తొమ్మిదో వారం హౌస్ నుంచి బయటికి వచ్చారు.
Also Read:
జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..