AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

ఇటీవల కొన్ని పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి. అందులో మోనికా సాంగ్ ఒకటి. గత ఆర్నేళ్లుగా ఈ పాట నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ చిత్రంలోని ఈ పాట ఎంతగా సూపర్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాటకు చిన్నా, పెద్ద తెగ ఎంజాయ్ చేశారు.

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..
Monica Song
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2026 | 11:48 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను ఊర్రూతలూగించింది. అలాగే ఇందులో పూజా హెగ్డేతోపాటు సౌబిన్ షాహిర్ డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సౌబిన్. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూ్బ్ లో ట్రెండ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..

ఇదిలా ఉంటే..ఇప్పుడు ఈ పాటకు ఓ ఐదేళ్ల చిన్నోడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ మూవీ వేడుకలో మోనికా పాటకు చిచ్చరపిడుగులా అదరగొట్టాడు. స్టేజ్ పై ఆ చిన్నోడి వెనుక పూజా హెగ్డే డ్యాన్స్ చేస్తు్న్నా ఏమాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఈ బుడ్డోడి స్టెప్పులు చూసిన నెటిజన్స్.. పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్ డ్యాన్స్ ను మించిపోయేలా చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ చిన్నోడి ఎనర్జీ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ బుడ్డొడి వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ చిత్రం గతేడాది 14న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో రజినీతోపాటు ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, అమీర్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. అలాగే అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..

ఎక్కువ మంది చదివినవి : Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..

Follow Us