AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameera Reddy: ఒక్క బ్లౌజ్‌ ధరతో 15 గ్రాముల బంగారం కొనచ్చని తెలుసా.. కలెక్షన్‌లో కాస్ట్‌లీ వస్తువులు ఇవే..

ఆమె ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ క్వీన్ గా వెలిగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తనదైన శైలిలో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా సెలబ్రిటీల వద్ద ఖరీదైన వస్తువులు ఉండటం సహజం. కానీ ఈ స్టార్ హీరోయిన్ వద్ద 2.5 లక్షల విలువైన ఒకే ఒక జాకెట్ ఉంది.

Sameera Reddy: ఒక్క బ్లౌజ్‌ ధరతో 15 గ్రాముల బంగారం కొనచ్చని తెలుసా.. కలెక్షన్‌లో కాస్ట్‌లీ వస్తువులు ఇవే..
Sameera Reddy
Nikhil
|

Updated on: Feb 14, 2026 | 8:29 PM

Share

అలాగే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ స్వయంగా గిఫ్ట్ గా ఇచ్చిన వాచీ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆమె వీటన్నింటినీ చూసి, ‘వీటికంటే బంగారం కొనుక్కుంటే బాగుండేది’ అని ఎందుకు అంటోంది? ఒకప్పుడు ఎయిర్‌పోర్ట్ లుక్స్ కోసం, ఇండస్ట్రీలో తోటి నటీమణులను చూసి పడ్డ ఒత్తిడి గురించి ఆమె పంచుకున్న షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ నటి మరెవరో కాదు.. సమీరా రెడ్డి.

ఒక్కొక్కరికి ఒక్కో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టం ఉంటుంది. సమీరా రెడ్డికి మాత్రం జాకెట్లు అంటే పిచ్చి. ఆమె భర్తకు కూడా తెలుసు, ఆమెకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అది డెనిమ్ లేదా కార్డ్యురాయ్ జాకెట్ అయి ఉండాలని. ఆమె వార్డ్‌రోబ్‌లో 2013లో 2.5 లక్షల రూపాయలకు కొన్న ఒకే ఒక్క షానెల్ జాకెట్ ఉంది. దీంతో పాటు మిక్కీ మౌస్ స్టిచ్చింగ్ ఉన్న గ్యాప్ జాకెట్ కూడా ఆమె ఫేవరెట్. కేవలం వెస్ట్రన్ డ్రెస్సులే కాదు, తన పెళ్లిలో కట్టుకున్న నీతా లుల్లా డిజైన్ చేసిన కంజీవరం చీరను కూడా ఆమె భద్రంగా దాచుకుంది. ఇప్పుడు ఆమె ఫాస్ట్ ఫ్యాషన్‌కు దూరంగా ఉంటూ, ఆర్గానిక్ కాటన్ దుస్తులకే ప్రాధాన్యత ఇస్తోంది.

Sameera Reddy Family

Sameera Reddy Family

ఖరీదైన బ్యాగుల వెనుక..

సమీరా రెడ్డి దగ్గర లిమిటెడ్ ఎడిషన్ బ్యాగులు చాలానే ఉన్నాయి. 2005లో కొన్న డియోర్ గౌచో బ్యాగ్ నుంచి, లక్షల విలువైన షానెల్ క్యావియర్ బ్యాగుల వరకు ఆమె కలెక్షన్‌లో ఉన్నాయి. అయితే వీటిని కొన్నందుకు ఆమె ఇప్పుడు బాధపడుతోంది. “నేను ఆ రోజుల్లో అందరిలో కలిసిపోవాలని, నేను కూడా ఒక స్టార్ అని చెప్పుకోవాలని ఈ మోనోగ్రామ్ ఉన్న బ్యాగులను కొన్నాను. అందరూ ఎయిర్‌పోర్ట్ లో ఎల్వీ (LV) బ్యాగులతో కనిపిస్తుంటే, నేను కూడా ఉండాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఈ బ్యాగుల కంటే ఒక గోల్డ్ బిస్కెట్ కొని ఉంటే బాగుండేదనిపిస్తుంది” అంటూ ఆమె నవ్వేశారు.

క్వైట్ లగ్జరీ అంటే..

సుమారు 12 ఏళ్ల క్రితమే సమీరా ఆలోచనల్లో మార్పు వచ్చింది. పెద్ద పెద్ద లోగోలు ఉన్న వస్తువులు ధరించి ‘నన్ను చూడండి’ అని అరవడం కంటే, సింపుల్ గా ఉంటూ ఖరీదైన నాణ్యతను ఎంచుకోవడమే ‘క్వైట్ లగ్జరీ’ అని ఆమె చెబుతోంది. ప్రస్తుతం ఆమె అక్రిస్ అనే బ్రాండ్ కి చెందిన 1.5 లక్షల రూపాయల మెసెంజర్ బ్యాగ్‌ను వాడుతోంది. దానిపై ఎలాంటి బ్రాండింగ్ కనిపించదు. తన కూతురు కూడా తనలాగే ట్రెండ్స్ వెంట పడి డబ్బులు వృధా చేయకూడదని, బంగారం లేదా వెండిపై ఇన్వెస్ట్ చేయాలని ఆమె సలహా ఇస్తోంది.

షారుఖ్ ఖాన్ ఇచ్చిన మొదటి గిఫ్ట్..

సినిమాల్లోకి రాకముందే సమీరా రెడ్డి ఒమేగా వాచీల కంపెనీలో పని చేసేది. ఆమెకు మొదటి లగ్జరీ వాచీని షారుఖ్ ఖాన్ బహూకరించారట. ఆమె వద్ద టాగ్ హ్యూయర్, టిస్సాట్, బివిల్గారి వంటి లక్షల విలువైన వాచీలు ఉన్నాయి. ఒకవైపు సింపుల్ లైఫ్ స్టైల్ ను ఇష్టపడుతూనే, మరోవైపు తన దగ్గర ఉన్న పాత వస్తువులను రీసైక్లింగ్ చేసి మళ్ళీ ధరించడం ఆమెకు అలవాటు. ఒక్కసారి వేసుకున్న బట్టలను మళ్ళీ వేసుకోకూడదు అనే పద్ధతిని ఆమె అస్సలు ప్రోత్సహించదు. సమీరా రెడ్డి ప్రయాణం చూస్తుంటే.. గ్లామర్ ప్రపంచంలో ఉండే ఒత్తిడిని జయించి, అసలైన ఆనందం ఎందులో ఉంటుందో ఆమె తెలుసుకున్నట్లు అనిపిస్తుంది. వస్తువుల కంటే విలువైన జ్ఞాపకాలకు, స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె చెబుతున్న మాటలు అందరికీ ఆదర్శం.

Follow Us