Anasuya: ఆరోజు అలా జరిగే సరికి మా ఆయనను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చా.. షాకింగ్ విషయం చెప్పిన అనసూయ
మొన్నటివరకు జబర్దస్త్ తో పాటు ఇతర టీవీ షోలతో బిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది అనసూయ. అలాగే కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించింది. అయితే జబర్దస్త్ లోకి అడుగు పెట్టాక ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తన అందం, చలాకీతనంతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. అదే సమయంలో క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాల్లో విలన్ గా, సహాయక నటిగానూ మెప్పించింది అనసూయ. ఇక రంగస్థలంలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర బాగా హైలెట్ అయ్యింది. దీంతో బుల్లితెరకు బై బై చెప్పేసి ఇప్పుడు సినిమాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది అనసూయ. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదే సమయంలో కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాలు, ఛీత్కారాల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది.
‘నా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో మూడు క్రేజీ ప్రాజెక్టుల కోసం నన్ను ముందుగా ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండా ఆ సినిమాల నుంచి నన్ను తొలగించారు. ఎందుకు తీసేశారు? ఏం జరిగింది? అన్న విషయంపై కనీస వివరణ కూడా ఇవ్వలేదు. ఆ సంఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మా ఆయన దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేశాను. ఆ బాధను జీర్ణించుకోలేకపోయాను’ అని వాపోయింది అనసూయ. ఇక సినిమాల గురించి కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలపై కూడా సోషల్ మీడియాలో అనవసర చర్చలు జరిగాయని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను. కానీ పరిమితంగానే తీసుకుంటాను. ఆ విషయాన్ని కూడా కొందరు వివాదంగా మార్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ట్రోలింగ్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. కాలక్రమంలో అలాంటి విషయాలను ఎదుర్కోవడం నేర్చుకున్నాను. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ట్రోల్స్ చేసినా చివరికి నేను నా పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను’ అని చెప్పుకొచ్చింది అనసూయ.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్..
View this post on Instagram
కాగా గతేడాది హరి హర వీరమల్లు, అరి: మై నేమ్ ఈజ్ నో బడీ అనే సినిమాల్లో నటించింది అనసూయ. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాగ బంధనం, ప్లాష్ బ్యాక్, వోల్ఫ్ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




