AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar OTT: ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్.. మిస్ అవ్వకుండా చూడాల్సిందే

రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ధురంధర్. మొత్తం రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 3000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా ఓటీటీలో ధురంధర్ సినిమా చూడాలనుకునేవారికి ఓ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది టీమ్.

Dhurandhar OTT: ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్.. మిస్ అవ్వకుండా చూడాల్సిందే
Dhurandhar Movie
Basha Shek
|

Updated on: May 21, 2026 | 4:29 PM

Share

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ధురంధర్‌’ . గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక దీనికి కొనసాగింపుగా ధురంధర్ ది రివేంజ్ కూడా వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా ధురంధర్ సినిమా రికార్డుల్లోకి ఎక్కింది. కాగా ఇప్పుడు ఓటీటీలోనూ ధురంధర్ 2 రికార్డులు కొల్లగొడుతోంది. ఇండియాలో ఇంకా స్ట్రీమింగ్ కు రాలేదు కానీ ఓవర్సీస్‌లో మాత్రం భారీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ అభిమానుల కోసం ధురంధర్ టీమ్ ఒక సర్ ప్రైజ్ ప్రకటించింది. అదేంటంటే.. ‘ధురంధర్’ మొదటి భాగం అన్‌కట్‌ వెర్షన్‌ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానుంది. . రెండు ఓటీటీల్లోనూ ఒకేరోజు ఇది స్ట్రీమింగ్‌ కు రానుంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’, ‘జియో హాట్‌స్టార్‌’ వేదికగా ‘ధురంధర్‌’ మొదటి భాగం అన్‌కట్‌ వెర్షన్‌ మే 22 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఓటీటీ సంస్థలు ప్రకటించాయి. సుమారు 3.25 గంటల నిడివితో పార్ట్‌ వన్‌ అన్‌కట్‌ వెర్షన్‌ రానుందని సమాచారం. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ధురంధర్ పార్ట్ వన్ అన్ కట్ వెర్షన్ ఓటీటీలోకి రానుందన్నమాట.

ఇక ఇక ఇండియాలో ‘ధురంధర్‌’ రెండో భాగం జూన్‌ 4 రాత్రి 7 గంటల నుంచి జియోహాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే మిగతా దేశాల్లో ఇప్పటికే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రెండో పార్ట్ ఓటీటీలో అదనంగా కొన్ని సన్నివేశాలను జోడించారు. థియేట్రికల్‌ రన్‌ 3 గంటల 49 నిమిషాలు కాగా, ఓటీటీ వెర్షన్‌ 3.52 నిమిషాలు. ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరికొన్ని గంటల్లో రెండు ఓటీటీలో ధురంధర్ పార్ట్  వన్ అన్ కట్ వెర్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
హోం లోన్ తీసుకున్న వారికి EMI ఎంత పెరగనుంది?
హోం లోన్ తీసుకున్న వారికి EMI ఎంత పెరగనుంది?