ఆ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులో మాట చెప్పిన నటి లైలా
ఒకప్పుడు తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న భామల్లో లైలా ఒకరు. ఈ అమ్మడు తన అందం, అమాయక చూపులతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లైలా స్మైల్ కు ఎవ్వరైనా పడిపోవాల్సిందే.. తెలుగు తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది ఈ చిన్నది.

ఒకానొక టైంలో దక్షిణాది సినిమాను ఏలిన క్రేజీ హీరోయిన్ లైలా. బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికీ, తమిళం, తెలుగు చిత్రాల్లోనే ఆమె గుర్తింపు పొందారు. దర్శకుడు శంకర్ ముదల్వన్ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసిన లైలా కెరీర్ లో తర్వాత చాలా త్వరగా స్టార్ డమ్ అందుకుంది. తెలుగు, తమిళ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో అగ్ర తారలతో, దర్శకులతో కలిసి పని చేసింది ఈ అందాల తార. ఈ క్రమంలోనే కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా లైలా నటించారు. మోడలింగ్ రంగం నుండి సినీ రంగ ప్రవేశం చేసిన లైలా, కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. ఇరాన్ వ్యాపారవేత్త మెహదితో తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న తర్వాత, 2006లో లైలా వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు పెద్దయ్యాక లైలా మళ్లీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. మొన్నామధ్య కార్తీ కథానాయకుడిగా నటించిన సర్దార్ చిత్రంతో ఆమె తిరిగి వచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత లైలా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.
ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ
తన ప్రేమ వివాహం గురించి, సినిమాలోని తన క్రష్ గురించి లైలా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మెహదితో తన తొమ్మిదేళ్ల ప్రేమకథను లైలా వివరించారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయని, ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఇంటర్వ్యూలోనే సినిమా రంగంలో తనకు క్రష్ అనిపించిన నటుడి గురించి కూడా లైలా మాట్లాడారు. సూర్యపైనే తనకు అలాంటి ఇష్టం కలిగిందని లైలా చెప్పారు. జ్యోతిక ఇది వింటే తనను చంపేస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. తాము మంచి స్నేహితులమని, చాలా కాలంగా ఒకరికొకరు తెలుసని లైలా చెప్పారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను
సూర్యతో తనకు బలమైన బంధం ఉందని లైలా గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు సూర్య, లైలా తమిళంలో హిట్ జోడీ. పితామగన్, ఉన్నై నినైతాల్ వంటి అనేక హిట్ చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. సూర్యకు ఉత్తమ ఆన్‌స్క్రీన్ జోడీ లైలా అని జ్యోతిక కూడా ఒకసారి చెప్పినట్లు ప్రస్తావించారు. జ్యోతికతో కూడా లైలాకు మంచి సంబంధం ఉంది. త్రీ రోసెస్ చిత్రంలో జ్యోతికతో కలిసి లైలా నటించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమా రంగంలో తన రీ ఎంట్రీ గురించి కూడా లైలా మాట్లాడారు. సినిమాలో ఈరోజు చాలా మార్పులు వచ్చాయని, ప్రస్తుత కథలు, పాత్రలు విభిన్నంగా ఉన్నాయని లైలా చెప్పారు. హీరో, హీరోయిన్ అనే పాత విధానం ఇప్పుడు లేదని, కొత్త రకాల సినిమాల పట్ల ప్రేక్షకులకు ఆసక్తి ఉందని, కాబట్టి తన రీ ఎంట్రీ పట్ల సంతోషంగా ఉన్నానని, మరిన్ని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నానని లైలా తెలిపారు.





