AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baahubali: ‘బాహుబలి’లో దేవసేన రోల్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతోనే..

బాహుబలి సినిమాల్లో ప్రభాస్ క్యారెక్టర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అనుష్క పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. దేవసేన క్యారెక్టర్ లో స్వీటీ అభినయం విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు.. ఈ సినిమాతోనే అనుష్కకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది.

Baahubali: 'బాహుబలి'లో దేవసేన రోల్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతోనే..
Baahubali
Basha Shek
|

Updated on: May 22, 2026 | 12:59 PM

Share

తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. అంతే కాదు.. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలకు పునాది వేసిందని చెప్పవచ్చు. మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఓవరాల్ గా రూ. 2500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాహుబలి సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్-3లో ఒకటిగా నిలిచింది. ఈ విజువల్ వండర్ లో ప్రభాస్ తో పాటు అనుష్క, దగ్గుబాటి రానా, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ, సత్య రాజ్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, అడివి శేష్, ప్రభాకర్, సుదీప్, చలపతి రావు, జాన్ కొక్కెన్, చివరికి రాజమౌళి కూడా ఓ పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దొరికిందని చెప్పవచ్చు. అమరేంద్ర బాహుబలి, శివుడు పాత్రల్లో ప్రభాస్ అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక సినిమాలో బాహుబలికి అన్ని విషయాల్లో తోడుగా నిలిచే భార్య పాత్రలో అనుష్క అద్భుతంగా నటించింది. దేవసేన పాత్రలో ఆమె చూపించిన రాజసం విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే నిజానికి రాజమౌళి ‘దేవసేన’ పాత్ర కోసం మొదట అనుష్కను అనుకోలేదట. లేడీ సూపర్ స్టార్ నయనతారను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట. అయితే నయనతార తిరస్కరించిన తర్వాత అనుష్క వద్దకు బాహుబలి ఆఫర్ వచ్చిందట

బాహుబలి లాంటి పెద్ద సినిమాలో నయన తార నటించకపోవడానికి ప్రధాన కారణం డేట్స్. ఈ పాన్ ఇండియా మూవీ సుమారు నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. దీంతో అన్నేళ్ల పాటు డేట్స్ ఇవ్వలేకపోయింది నయనతార. ఇన్ని రోజులు ఒకే సినిమాకు కేటాయించడం కంటే, మరిన్ని చిత్రాల్లో నటించడమే బెటర్ అనుకుందట నయన్. అందుకే బాహుబలి సినిమాను వద్దనుకుందట. మొత్తానికి బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసి మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందని చెప్పవచ్చు. అదే సమయంలో అనుష్క వెంటనే ఈ పాత్రకు ఓకే చెప్పి పాన్-ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

వాటికన్ సిటీ వెకేషన్ లో భర్త, పిల్లలతో నయనతార..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us