AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Thottempudi: ఇష్టం లేకున్నా ఆ సినిమాలో నటించా.. బాగా దెబ్బేసింది.. హీరో వేణు కామెంట్స్ వైరల్

ఒకప్పుడు కామెడీ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు తొట్టెంపూడి. అలాగే పలు సూపర్ హిట్ ప్రేమకథా చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడీ నటుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితే త్వరలోనే తన రీఎంట్రీ ఉంటుందని ఒక హింట్ ఇచ్చాడు వేణు

Venu Thottempudi: ఇష్టం లేకున్నా ఆ సినిమాలో నటించా.. బాగా దెబ్బేసింది.. హీరో వేణు కామెంట్స్ వైరల్
Venu Thottempudi
Basha Shek
|

Updated on: May 21, 2026 | 6:06 PM

Share

1999లో స్వయం వరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమతోనే మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు. హీరో గానూ ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత కూడా మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, అల్లరే అల్లరి, బహుమతి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు. రాజేంద్రప్రసాద్ తరహాలోనే కామెడీ హీరోగా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే వెంకటేష్ చింతకాలయ రవి, ఎన్టీఆర్ దమ్ము లాంటి సినిమాల్లో సహాయక నటుడిగానూ మెప్పించాడు వేణు. అయితే 2013 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు వేణు. చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. అయితే 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన  సీఐ మురళి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. సినిమాలో వేణుకు స్క్రీన్ స్పేస్ బాగానే దక్కినప్పటికీ రిజల్ట్ మాత్రం దెబ్బేసింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.  దీంతో తన రీఎంట్రీ ఘనంగా ప్రారంభించాలనుకున్న వేణు బాగా నిరాశ చెందాడు.

అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు వేణు తొట్టెంపూడి. ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత తనను ఇబ్బంది పెట్టడం వల్లే తనకు ఇష్టం లేకపోయినా, మొహమాటానికి పోయి ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని షాకింగ్ విషయం బయట పెట్టాడు’ నిజానికి నేను చాలా కాలం తర్వాత వెండితెరపైకి వస్తున్నప్పుడు చాలా బెటర్ క్యారెక్టర్‌తో రావాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ రామారావు ఆన్ డ్యూటీ  సినిమా దర్శకుడు, నిర్మాత నన్ను తీవ్రంగా పెట్టారు. నాకు ఆ పాత్ర చేయడం అస్సలు ఇష్టం లేదు. అయినా కేవలం మొహమాటానికి పోయి ఓకే అనాల్సి వచ్చింది. ఒక్కోసారి ఇండస్ట్రీలో ఇలాంటి మొహమాటాల వల్ల సినిమాలు చేయాల్సి వస్తుంది. మూవీ సక్సెస్ అయితే ఒకే. ఫలితం తేడా కొడితే కెరీర్ మళ్లీ వెనక్కి అడుగు వేస్తుంది’ అని వేణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
కాసులవర్షం కురిపించిన కండోమ్ కంపెనీ షేర్లు- 10 ఏళ్లలో 14,000 శాతం
కాసులవర్షం కురిపించిన కండోమ్ కంపెనీ షేర్లు- 10 ఏళ్లలో 14,000 శాతం