AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Tips: ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా..? ఈ 6 పనులు చేస్తే మీ బిల్లు ఆదా..

ఇంట్లో అవసరం లేకపోయినా చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలు ఆన్ చేసి పెట్టుకుంటారు. దీని వల్ల కరెంట్ అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది. దీంతో కరెంట్ బిల్లు అనేది పెరుగుతుంది. కానీ కొన్ని పరికరాలు ఆఫ్ చేసినా స్టాండ్ బై మోడ్‌లో కరెంట్‌ను వాడతాయి.

Venkatrao Lella
|

Updated on: May 22, 2026 | 12:55 PM

Share
ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చాలామంది బాధపడుతుంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పులే కరెంట్ బిల్లు ఎక్కువగా రావడానికి దోహదపడతాయి. ఇంట్లో ఉపయోగించే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫ్‌లో ఉన్నా కూడా విద్యుత్‌ను వినియోగిస్తాయి. టీవీలు, ఛార్జర్లు వంటివి స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నా కరెంట్‌ను వాడతాయి. కొన్ని సర్వేల్లో ఆరు గాడ్జెట్లు స్టాండ్‌బై మోడ్‌లో ఉన్న కరెంట్ వినియోగిస్తాయని తేలింది.

1 / 5
సెట్ టాప్ బాక్సులు, టీవీలు, ఛార్జర్లు వంటివి స్టాండ్ బై మోడ్‌లో చాలామంది ఉంచుతుంటారు. దీని వల్ల కరెంట్ వినియోగిస్తూనే ఉంటుంది. చాలామంది రిమోట్ ఉపయోగించి టీవీ ఆఫ్ చేస్తారు. దీని వల్ల టీవీ పూర్తిగా ఆఫ్ అవ్వకుండా స్టాండ్ బై మోడ్‌లోకి వెళుతుంది. ఇలాంటి సమయంలో స్క్రీన్ ఆగిపోయినప్పటికీ బ్యాక్ ఎండ్‌లో విద్యుత్ వినియోగించుకుంటూ ఉంటుంది.

2 / 5
ఇలాంటి సమయంలో మీరు టీవీ మెయిన్ పవర్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి. దీని వల్ల కరెంట్ అనేది ఆదా అవుతుంది. ఇక సెట్ ఆప్ బాక్స్‌లు కూడా స్టాండ్ బై మోడ్‌లో ఉంటాయి. దీంతో సెట్ ఆఫ్ బాక్స్‌ను రిమోట్‌లో ఆఫ్ చేయకుండా మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయండి. ఇక ఛార్జర్‌ను సాకెట్‌లో ప్లగ్ చేసి అలాగే ఉంచుతారు. దీంతో ఛార్జర్ వాడిన తర్వాత వెంటనే సాకెట్ నుంచి తీసివేయండి.

3 / 5
ఇక ఏసీని రిమోట్‌తో ఆఫ్ చేస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. అది పెద్ద తప్పు. రిమోట్‌తో ఆఫ్ చేస్తే ఏసీ ఆగిపోతుందని చాలామంది అనుకుంటారు. ఏసీలో ఉండే ఇంటర్నల్ సర్క్యూట్రీ స్టాండ్ బై మోడ్‌లో ఉంటుంది. దీంతో మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయడం వల్ల కరెంట్ ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఇక ఇంటర్నెట్ అవసరం లేనప్పుడు వైఫై రౌటర్ కూడా ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఇంటర్నెట్ అవసరం లేనప్పుడు రౌటర్ స్విచ్‌ను ఆఫ్ చేయండి. రాత్రి పడుకునేటప్పుడు లేదా ఇంటి నుంచి ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఆఫ్ చేయడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది. ఇక ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కూడా అవసరం లేననప్పుడు ఆఫ్ చేయడం మంచిది. ఆర్‌వో ట్యాంక్ నిండిన తర్వాత ట్యాంక్‌లోని నీరు తగ్గే వరకు ఆఫ్ చేయండి. ఇది కూడా విద్యుత్‌ను ఆదా చేస్తుంది.

5 / 5
Follow Us