ఎన్నో అవమానాలు చూశా.. అందుకే నేను ఇస్లాం మతం స్వీకరించా..! షాకింగ్ విషయం చెప్పిన హీరో జై
సినీ రంగంలో పలువురు ప్రముఖులు ఒక మతం నుంచి మరొక మతంలోకి మారారు. ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా, ఏ.ఆర్. రెహమాన్‌ల తర్వాత, నటుడు జై ఇస్లాం మతం స్వీకరించినట్లు ఇటీవల ఒక తమిళ యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపారు .

సినిమా తారలు, ప్రముఖులు మతాలు మారడం అనేది తరచుగా చర్చకు వస్తుంది. ఎవరిని నచ్చిన మతంలోకి వారు మారుతున్నారు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమ నుంచి ఇటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా ఇస్లాం మతం స్వీకరించిన వార్త గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అదే విధంగా, ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కూడా మొదట హిందువుగా ఉండి, ఆ తరువాత ఇస్లాంలోకి మారారు. అలాగే ప్రముఖ నటుడు జై 2014లో ఇస్లాంను స్వీకరించినట్లు తెలిపాడు. ఏ.ఆర్. రెహమాన్, యువన్ శంకర్ రాజా, మోనికా వంటి ఇతర నటుల మాదిరిగానే, జై కూడా ఇస్లాం వైపు ఆకర్షితులయ్యారు. ఆయన తన నిర్ణయానికి దారితీసిన కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లుప్తంగా వివరించారు. జై తన ఆధ్యాత్మిక ప్రయాణంలో వివిధ మతాలను అన్వేషించినట్లు తెలిపారు. శబరిమలకు మాల ధరించి, అలాగే జీసస్ కోసం రోసరీ మాల ధరించి ఒక సంవత్సరం ఉపవాసం కూడా ఉన్నానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ
అయితే, కొన్ని అనుభవాలు తన మనసును కలచివేశాయని, ముఖ్యంగా గుడిలో ఎదురైన అసంతృప్తికర సంఘటనలు, వాటిలో దాగి ఉన్న కులతత్వం, అసమానతలు తనను ఆలోచింపజేశాయని చెప్పారు. కుల వ్యవస్థ హిందూ సమాజంలోనే కాకుండా, భారతదేశంలోని ఇతర మతాల ప్రజలపైనా ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకసారి మసీదును సందర్శించినప్పుడు జై ఒక విభిన్నమైన అనుభూతిని పొందారట. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, తాను ఒక నటుడినని అందరికీ తెలిసినా, ఎవరూ తనతో లోపల మాట్లాడలేదని, ఫోటోలు అడగలేదని తెలిపారు. అందరూ బయటకు వచ్చి మర్యాదగా మాట్లాడారని చెప్పారు. ఈ అనుభవం మసీదులలో ఉన్న సమానత్వాన్ని, దేవుడిని మాత్రమే గొప్పగా భావించే తత్వాన్ని, ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా పట్టించుకోని వైఖరిని ఆయనకు అర్థం చేయించిందట. ప్రార్థనలో లభించిన శాంతి, సౌకర్యం తనను ఆకట్టుకున్నాయని, అది యోగా మాదిరిగానే అనిపించిందని అన్నారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను
ఇస్లాంను అనుసరించడం వల్ల తన వ్యక్తిగత స్వభావం మెరుగుపడిందని జై పేర్కొన్నారు. ముఖ్యంగా సహాయ గుణం పెరిగిందని, అనవసర వస్తువుల కొనుగోళ్లను తగ్గించి, అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల ఎంతో సంతృప్తి లభించిందని తెలిపారు. ఇస్లాంలో ఉన్న కఠినమైన నియమాలు, ముఖ్యంగా జకాత్ గురించి ఆయన ప్రస్తావించారు. ధనవంతులు తమ సంపాదనలో 2.5శాతం లేనివారికి తప్పకుండా ఇవ్వాలని, అప్పుడే నిజమైన ముస్లింగా పరిగణించబడతారని ఆయన చెప్పారు. ఇది కేవలం 2.5 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇష్టపడ్డవారు ఎంతైనా ఇవ్వవచ్చని వివరించారు. ఇస్లాం వడ్డీని నిషేధించి, దానధర్మాలను ప్రోత్సహిస్తుందని, ఇది మనసుకు శాంతి, సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు.




