Namitha: నయా బిజినెస్ మొదలుపెట్టిన నమిత.. త్వరలోనే ఆ రంగంలోకి అడుగు
ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నమిత ఈ మధ్య అడపాదడపా కనిపిస్తూ అలరిస్తున్నారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమైనా నమిత ఆతర్వాత బరువు పెరిగారు.
Namitha: ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నమిత ఈ మధ్య అడపాదడపా కనిపిస్తూ అలరిస్తున్నారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమైనా నమిత ఆ తర్వాత బరువు పెరిగారు. నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘సింహ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అదే సినిమాలో బాలయ్యతో చిందులు కూడా వేశారు. సింహ సినిమా తర్వాత కూడా నమితకు అనుకున్నన్ని అవకాశాలు రాలేదు. దాంతో ఆమె మళ్లీ సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. 2017లో తన ప్రియుడు వీరేంద్రను పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనుందని తెలుస్తుంది. త్వరలోనే నమిత ప్రొడక్షన్ వర్క్స్, నమిత ఓటీటీ యాప్ ను ప్రారంభించబోతున్నానని నమిత చెప్పారు.
తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆసమయంలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయలను తెలిపారు. తాను భౌ భౌ అనే సినిమాలో నటిస్తున్నని అన్నారు నమిత. ‘భౌ భౌ’ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయిందని తెలిపారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా..? లేక ఓటీటీలో విడుదల చేయాలా..? అనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తాను నిర్మాణ రంగంలోకి అడుగు పేతున్న విషయాన్నీ కూడా తెలిపారు నమిత. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుపుతామని ఆమె అన్నారు. ‘జెమిని’ సినిమాతో వెంకటేశ్ సరసన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నమిత… ఆ తర్వాత తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :