Balamevvadu: సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులే టార్గెట్‌గా బలమెవ్వడు.. ఆకట్టుకుంటోన్న టీజర్.
Balamevvadu Teaser: కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ దైవంగా భావించేది వైద్యులనే. అందుకనే డాక్టర్ల ముందు ఎలాంటి అబద్ధం చెప్పరు. ఇక ప్రాణం కంటే డబ్బు ప్రాధానమైనది కాదని భావిస్తూ ఎంతైన ఖర్చు చేయడానికి...
Balamevvadu Teaser: కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ దైవంగా భావించేది వైద్యులనే. అందుకనే డాక్టర్ల ముందు ఎలాంటి అబద్ధం చెప్పరు. ఇక ప్రాణం కంటే డబ్బు ప్రాధానమైనది కాదని భావిస్తూ ఎంతైన ఖర్చు చేయడానికి సిద్ధమవుతుంటారు. అయితే ప్రజల ఈ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటూ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. రూ. లక్షల్లో ఫీజుల రూపంలో వసూళు చేసి చివరికి శవాలను అప్పగించారంటూ ఎన్నో సంఘటనలను మీడియాలో చూశాం.
ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రుల ధన దాహాన్ని ప్రశ్నిస్తూ ఇప్పటి టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ కాన్సెప్ట్‌తోనే మరో సినిమా వస్తోంది. అదే.. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ‘బలమెవ్వడు’ . ఈ సినిమాలో సుహసినీ, నాజర్, పృథ్విరాజ్ వంటి సీనియర్ నటీ, నటులు నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గమినిస్తే.. కార్పొరేట్ ఆసుపత్రులను లక్ష్యంగా తీసుకొని తీసినట్లు కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలకు సంబంధించిన మీడియా క్లిప్స్‌తో ఈ టీజర్‌ను రూపొందించారు. భగవద్గీతలోని పలు శ్లోకాలను ఊటంకిస్తు ఉన్న టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి కాంట్రవర్సీలకు తెర తీస్తుందో చూడాలి.
Also Read: Allu Family: వెండతెర ఎంట్రీ ఇవ్వనున్న అల్లు వారసురాలు.. లాంచ్ చేయనున్న స్టార్ ప్రొడ్యుసర్.?
Heroine With Mehandi: చేతిలో గొరింటాకు వేసుకొని.. అటుగా తిరిగి ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా.?
Anupama Parameswaran: లవ్ ఫెయిల్ అయ్యిందని షాక్ ఇచ్చిన అనుపమ.. అతడితోనేనా..?