Heroine With Mehandi: చేతిలో గొరింటాకు వేసుకొని.. అటుగా తిరిగి ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా.?
Heroine With Mehandi: ఆషాఢ మాసం మొదలవబోతోంది. ఈ మాసం రాగానే మహిళలకు ఠక్కున గుర్తొచ్చేది గోరింటాకు. సాధారణంగా కోన్‌లు కాకుండా గోరింటాకు చెట్టు ఆకులు తెంచుకొని.. ముద్దగా నూరి చేతులకు గొరింటాకుగా వేసుకుంటారు...
Heroine With Mehandi: ఆషాఢ మాసం మొదలవబోతోంది. ఈ మాసం రాగానే మహిళలకు ఠక్కున గుర్తొచ్చేది గోరింటాకు. సాధారణంగా కోన్‌లు కాకుండా గోరింటాకు చెట్టు ఆకులు తెంచుకొని.. ముద్దగా నూరి చేతులకు గొరింటాకుగా వేసుకుంటారు. ఇక దీనికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. నటీమణులు కూడా చేతికి గోరింటాకు పెట్టుకొని తమ సరదాను తీర్చుకుంటారు. తాజాగా మెగా డాటర్ నిహారిక గోరింటాకు పెట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటుగా నిలబడి చేతికి పెట్టుకున్న గోరింటాకును చూపిస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు మెగా డాటర్ నిహారిక.
గతంలో దిగిన ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నిహారిక ‘థ్రో బ్యాక్’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. ఈ ఫొటోను ఏకంగా 80 వేల మందికిపైగా లైక్‌లు కురిపించారు. మెగా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి నటీమణీగా నిహారిక అరుదైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ‘ఒక మనసు’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించారు. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా ఆకట్టుకున్నారు నిహారిక. గతేడాది వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన నిహారిక చివరిగా మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నర్సింహా రెడ్డి’ చిత్రంలో కనిపించారు. ఇదిలా ఉంటే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన్పటికీ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు తాజాగా 2 మిలియన్లకు చేరుకోవడం విశేషం.
నిహారిక చేసిన పోస్ట్..
View this post on Instagram
Kathi Mahesh Death : కత్తి మహేష్ కన్ను మూయడానికి అసలు కారణం అదేనా..?