Madhuri Dixit: సీనియర్ నటికి ఆర్ధికంగా అండగా నిలబడిన డ్యాన్స్ దీవానే టీమ్.. రూ.5 లక్షలు అందించిన మాధురీ దీక్షిత్
Madhuri Dixit: ఎవరు ఎప్పుడు ఎలాంటి స్టేజ్ కు చేరుకుంటారో ఎవరికీ తెలియదు..బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి. ఎంతో గొప్పగా దర్జాగా బతికిన..
Madhuri Dixit: ఎవరు ఎప్పుడు ఎలాంటి స్టేజ్ కు చేరుకుంటారో ఎవరికీ తెలియదు..బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి. ఎంతో గొప్పగా దర్జాగా బతికిన వారు కాలక్రమంలో ఆర్ధికంగా చితికి పోయి అనేక కష్ఠాలు పడ్డారు. ఇప్పటికీ అనేక మంది అలా కష్టాలు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ నటీనటులు ఒకప్పుడు ఎంతో రిచ్ గా బతికిన వారు కాలక్రమంలో ఆస్తులు కరిగిపోయి.. వేషాలు లేక పూట గడవక ఎన్నో తిప్పలు పడుతున్నారు. అటువంటి వారిలో ప్రస్తుతం షా గుప్తా లీ ఒకరు. హిందీ సీరియల్స్ చూసే అలవాటు ఉన్నవారికి ఎంతో పరిచయమైన పేరు, ఫేస్. 30 ఏళ్లకు పైగా నటిగా ప్రధాన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన షాగుఫ్తా ఆలీ నేడు అనారోగ్యంతో కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు.
ఇటీవలే ఒక డ్యాన్స్ షో కి హాజరైన ‘షా గుప్తా లీ’ తన ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిని చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. మాధురి దీక్షిత్ జడ్జ్ గా ప్రసారమవుతున్న డ్యాన్స్ దీవానే 3 కి షా గుప్తా లీ వచ్చారు. ఇదే స్టేజ్‌పై షాగుఫ్తా ఆలీ .. మాట్లాడుతూ.. తన కెరీర్ లో 25 ఏళ్ళు బాగా సాగిందని.. తన ఫ్యామిలీని బాగా సంరక్షించుకున్నానని చెప్పారు.. అయితే గత నాలుగేళ్లుగా తనకు సరైన అవకాశాలు దొరకడం లేదు.. ఎన్ని ఆడిషన్స్ కు వెళ్లినా తనకు అవకాశాలు రాకపోవడంతో ఆర్ధికంగా కష్టాలు మొదలయ్యాయి. ఇక మరోవైపు
షుగర్ వ్యాధి తో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. కంటి చూపు మందగించింది. కాళ్ళు చచ్చుపడేంత ప్రమాదం ముంచుకొచ్చింది. అంటూ స్టేజ్ మీద కన్నీరు పెట్టుకున్నారు. ఆమె కష్టాలు విన్న అక్కడ అందరి మనసు స్పందించింది. హోస్ట్, కమెడియన్ భారతీ సింగ్ షాగుఫ్తా ఆలీ ని కౌగిలించుకొని ఓదార్చారు.
అయితే డ్యాన్స్ దీవానే టీమ్ వెంటనే స్పందించింది. కష్టంలో ఉన్న ఆమె ను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. టీమ్ తరపున రూ.5 లక్షలను అందించడానికి నిర్ణయించుకుంది. జడ్జ్ మాధురి దీక్షిత్ ఆ ఐదు లక్షల రూపాయల చెక్ ను షాగుఫ్తా ఆలీ కి అందజేశారు. తాము అందరం అండగా ఉంటామని ఓదార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవడానికి డ్యాన్స్ దీవానే టీమ్ నిర్ణయం తీసుకుంది అంటూ మాధురీ దీక్షిత్ చెప్పారు.
Also Read: అక్కడ టాయిలెట్ ను ఉపయోగిస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తారు.. మానవవ్యర్ధాలతో విద్యుత్ తయారీ ఎక్కడంటే
ఆహా లో ప్రసారమవుతున్న విక్రమార్కుడు.. పిసినారి డాన్‌గా నవ్వులు పూయించిన విజయ్ సేతుపతి