AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The BeeVi Toilet: అక్కడ టాయిలెట్ ను ఉపయోగిస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తారు.. మానవవ్యర్ధాలతో విద్యుత్ తయారీ ఎక్కడంటే

The BeeVi Toilet: పే అండ్ యూజ్.. సాధారణంగా బయటకు వెళ్లిన సమయంలో పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రయోగిస్తే.. వాడే స్లోగన్.. బస్టాండ్స్, రోడ్ల పక్కన ఉండే టాయిలెట్స్ వంటివి ఉపయోగిస్తే...

The BeeVi Toilet: అక్కడ టాయిలెట్ ను ఉపయోగిస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తారు.. మానవవ్యర్ధాలతో విద్యుత్ తయారీ ఎక్కడంటే
Beevi Toilet
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 10, 2021 | 4:06 PM

Share

The BeeVi Toilet: పే అండ్ యూజ్.. సాధారణంగా బయటకు వెళ్లిన సమయంలో పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రయోగిస్తే.. వాడే స్లోగన్.. బస్టాండ్స్, రోడ్ల పక్కన ఉండే టాయిలెట్స్ వంటివి ఉపయోగిస్తే.. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి మాత్రమే వాటిని యూజ్ చేయాలి.. అయితే దక్షిణ కొరియాలో మాత్రం అందుకు విరుద్ధం.. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ ను ఉపయోగించండి.. డబ్బులు తీసుకోండి అని అంటున్నారు. అవును అక్కడ పబ్లిక్ టాయిలెట్ ను ఉపయోగిస్తే..మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తిరిగి మనకే ఇస్తున్నారు.. దీనికి చేయాల్సింది ఒకటే.. పబ్లిక్ టాయిలెట్ లో ఉనన్ ఒక క్యూర్ కోడ్ ను స్కాన్ చేస్తే.. నేరుగా డబ్బులు టాయిలెట్ ను ఉపయోగించిన వ్యక్తి అకౌంట్ లో జమవుతాయి. దక్షిణకొరియాలోని డబ్బులిచ్చే టాయిలెట్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

టాయిలెట్ లోని మానవ వ్యర్ధాలతో విద్యుత్ ను తయారు చేసే విధంగా ఓ ఇంజనీర్ ప్రొఫెసర్ సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఉల్సన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పనిచేస్తున్న చో జై-వూన్ ఈ టాయిలెట్ ను రూపొందించారు.

ఈ టాయ్‌లెట్‌ కి ” ది బీవి టాయ్‌లెట్” అనే పేరు కూడా పెట్టారు. ఈ టాయిలెట్ లోని మానవ వ్యర్ధాలను ఒక ట్యాంక్‌లోకి వెళ్లేలా చేస్తారు. వాటికి కొన్ని రకాల సూక్ష్మజీవులను ఊపయోగించి మానవ వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తున్నారు. ఆ మీథేన్ సహాయంతో హాట్ బాయిలర్, గ్యాస్ స్టవ్, ఇతర ఎలక్ట్రానిక్ వంటి పరికరాలకు విద్యుత్ ను అందించవచ్చునని చో జై-వూన్ చెప్పారు. అంతేకాదు ఇందులో నుంచు ఉత్పత్తి అయ్యే 50 లీటర్ల మీథేన్ .. 0.5 కిలో వాల్టుల విద్యుత్తు తయారవుతుంది. ఈ విద్యుత్ సహాయంతో కారులో 1.2 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. అంతేకాదు మీథేన్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ తో ఎన్నో విద్యుత్ పరికరాలకు శక్తిని అందించవచ్చనని చెప్పారు.

ప్రస్తుతం ఈ టాయిలెట్ ను యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్ ను స్టూడెంట్స్ ఉపయోగించి డబ్బులు పొందవచ్చు. అంతేకాదు ఒక మనిషి రోజుకు 500 గ్రాముల మలవిసర్జన చేస్తాడు. దీనిని 50 లీటర్ల మీథేన్ వాయువుగా మార్చవచ్చని పర్యావరణ ఇంజనీర్ తెలిపారు. అనంతరం విద్యుత్ .. తో అనేక ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు.

Also Read:   కలియుగ దానకర్ణుడు..మ్యాన్ ఆఫ్ ద మిలీనియం.. ఈ తాతగారు 36 ఏళ్ల జీతం సహా రూ.30 కోట్లు పేదలకు దానం