AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyana Sundaram: కలియుగ దానకర్ణుడు..మ్యాన్ ఆఫ్ ద మిలీనియం.. ఈ తాతగారు 36 ఏళ్ల జీతం సహా రూ.30 కోట్లు పేదలకు దానం

Kalyana Sundaram Librarian: కొంతమంది ఉన్నదానిలో కొంత దానం చేస్తారు.. మరికొందరు దానం చేయడానికి తమ దగ్గర ఏమి ఉంది అని తప్పించుకుంటారు. అయితే నిజానికి దానం..

Kalyana Sundaram: కలియుగ దానకర్ణుడు..మ్యాన్ ఆఫ్ ద మిలీనియం.. ఈ తాతగారు 36 ఏళ్ల జీతం సహా రూ.30 కోట్లు పేదలకు దానం
Kalyana Sundaram
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2021 | 3:25 PM

Share

Kalyana Sundaram Librarian: కొంతమంది ఉన్నదానిలో కొంత దానం చేస్తారు.. మరికొందరు దానం చేయడానికి తమ దగ్గర ఏమి ఉంది అని తప్పించుకుంటారు. అయితే నిజానికి దానం చేయాలంటే.. కావలసింది..అధిక ధనం ఆస్తులు కాదు.. తమకి ఉన్న దానిలో దానం చేస్తామనే గుణం. కానీ ఈ తాత అందరికంటే భిన్నం.. తనకు ఉన్నది.. తాను జీవితాంతం సంపాదించింది.. ప్రతి రూపాయి.. పేదల ఉన్నతి కోసం ఖర్చుపెట్టి.. కలియుగ దాన కర్ణుడు అనిపించుకున్నాడు. చూడడానికి సన్నగా బలహీనంగా, సిగ్గుపడుతున్నల్టు .. చూడగానే పరిచయమైన వ్యక్తి లా ఆప్యాయతకు కేరాఫ్ అడ్రస్ లా అనిపించే తాత పాలమ్ కళ్యాణసుందరం. మానవత్వం తో చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డులు, రివార్డులు అందుకున్నారు ఈ తాత. తన జీవితంలో 30 కోట్ల రూపాయలను విరాళముగా ఇచ్చి మనిషుల్లో మహనీయుడుగా నిలిచారు.

అవును ఎవరైనా తనకు ఉన్నదానితో దానం చేస్తారు.. అంతేకానీ ఉన్నదంతా దానం చేయడం అనేది లోకంలో బహుఅరుదు. అలాంటి ఉత్తమ వ్యక్తి మహాభారతంలో కర్ణుడు అయితే.. ఈ కలియుగం లో కల్యాణ సుందరం. ఆ తాత గురించి ఎంత విన్నా తక్కువే అనిపిస్తుంది. అతనని చూస్తే నడిచొస్తుంటే మూర్తీభవించిన మానవత్వం అనిపిస్తుందని పరిచయస్తులు చెబుతారు. ఎందుకంటే కళ్యాణ్ సుందరం ఫిలాసఫీ అంత గొప్పది.

తాను బతకడమే కాదు తన తోటివాడు కూడా బతకాలి అని ఆలోచించే వ్యక్తి కల్యాణ సుందరం. తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఊహతెలియక ముందే మరణించడంతో తల్లి లాలన లో పెరిగారు. తల్లి దగ్గరనుంచి ఉన్నదాంట్లో సాయం చేయాలనే గుణాన్ని నేర్చుకున్నారు. ఎంతో కష్టపడి లిటరేచర్‌ లో మాస్టర్ డిగ్రీ చేశాడు. లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ మెడలిస్టు.

దీంతో కల్యాణ సుందరం లైబ్రేరియన్ గా జీవితం మొదలు పెట్టారు. ఉద్యోగంలో చేస్తూ అందుకున్న మొదటి నెల జీతాన్ని విరాళంగా ఇవ్వడం మొదలు పెట్టారు. అలా మొదలైన విరాళాల పరంపర అలా కొనసాగింది. లైబ్రేరియన్ గా డ్యూటీ అయిపోగానే, ఒక హోటల్లో సర్వర్‌ గా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేసేవారు.

తన జీతంలో సంపాదించిన ప్రతీ పైసా పక్కవాడి క్షేమం కోసమే ఖర్చు చేశారు. చివరికి రిటైర్ మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చారు. అతని సేవలను కేంద్ర ప్రభుత్వమే కాదు.. అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం కల్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్ గుర్తించి సన్మానించింది. అంతేకాదు అమెరికా ‘మ్యాన్ ఆఫ్ ద మిలీనియం’ అవార్డు ఇచ్చి సత్కరించింది.కేంబ్రిడ్జి ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్ధ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి కళ్యాణ్ సుందరాన్ని 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా కీర్తించింది.

అయితే కల్యాణ సుదరం పెళ్లి చేసుకోలేదు. ఎందుకని ఎవరైనా అడిగితే పెళ్లి చేసుకుంటే.. జీవితంలో చేయాలనుకున్న పనుల ప్రాధాన్యత మారిపోతుంది. బంధాలు మనము చేయాలనుకునే పనులకు అడ్డుగా నిలుస్తాయి. అంటారు.. అంతేకాదు నా పేరులోనే కళ్యాణం ఉంది.. ఇంకెందుకు పెళ్లి అని తనమీద తానె జోక్ చేసుకునే మంచి మనసు కల్యాణ సుందరం సొంతం. తన కుటుంబానికి పెట్టాల్సిన ఖర్చుని.. సమాజానికి పెడతా అనుకున్నారు.. పెళ్ళికి దూరంగా ఉన్నారు.

దేశ విదేశాల్లో ఇంతటి ఖ్యాతినార్జించిన కల్యాణ సుందరం చాలా సాదాసీదా జీవితాన్ని అనుభవిస్తారు. తనను జీవితంలో ఇంప్రెస్ చేయనిది డబ్బు ఒకటే అంటారు. అందుకే ఉన్న డబ్బుని నలుగురికీ పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నారు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్లం. మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటారు సుందరం. ఈ కర్మ సిద్ధాంతం అందరూ చెబుతారు.. కానీ ఆశించేది మాత్రం నూటికో కోటికో ఒక్కరు. అలాంటి మహనీయుడు కనుకనే తాను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయని దానం చేయగలిగారు. అందుకనే అంతర్జాతీయ మీడియా సైతం కళ్యాణ్ సుందరం గురించి ఘనంగా కీర్తించింది. కల్యాణ సుందరం నిజంగా స్ఫూర్తి ప్రదాత. కలియుగ దానకర్ణుడు.. ఉత్తమ వ్యక్తి గా కీర్తింపబడుతున్నారు.

Also Read:  రెండోసారి తండ్రైన హర్భజన్ సింగ్.. మా కుటుంబం పరిపూర్ణమైంది అంటూ ట్వీట్