Govt Schemes: సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?.. సబ్సిడీతో కూడిన భారీ రుణాలు అందించే ప్రభుత్వ పథకాలు ఇవే..
Government Business Schemes: కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ విధించడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని...
Government Business Schemes: కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ విధించడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ప్రజలు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయారు. ఉపాధిలేక అనేక మంది రోడ్డున పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అయితే, కరోనా కారణంగా ఎదురైన పరిస్థితుల దృష్ట్యా ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు వస్తోంది. ఉద్యోగాల బదులు వ్యాపారం చేసుకోవడం ఉత్తమం అని భావిస్తున్నారు. అయితే, వ్యాపారం చేయాలన్నా డబ్బు చాలా అవసరం. కరోనా సంక్షోభ సమయంలో డబ్బులు లభించని పరిస్థితి ఉంది. అయితే, డబ్బుల గురించి ఇప్పడు వర్రీ అవ్వాల్సిన పని లేదనే చెప్పాలి. ఎందుకంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ పథకాల ద్వారా ప్రజలు తమ వ్యాపారాలను ప్రారంభించవచ్చు. వ్యాపారాలకు ఆసరాగా ఉన్న పథకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్రా లోన్.. కేంద్ర ఇచ్చే రుణం. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన పథకాల్లో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే చాలా మందికి ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. ఈ పథకం ప్రత్యేక లక్షణం ఏంటంటే.. తక్కువ వడ్డీ, తక్కువ నిబంధనలతో రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రుణాలను మూడు విభాగాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 27.28 కోట్ల ఖాతాలు తెరవగా, 68 శాతం మహిళలకు ముద్రా రుణాలు ఇచ్చారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా బ్యాంక్‌కు వెళ్లడం ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని రుణం పొందవచ్చు.
పిఎం కుసుమ్ యోజన.. ఈ పథకం ద్వారా ప్రభుత్వం.. తమ పొలంలో లేదా ఇంటిపై సోలార్ ప్యానెల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకునే వారికి డబ్బు ఇస్తుంది. దీనితో మీరు మీ ఇంటికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. అదనపు విద్యుత్తును తిరిగి ప్రభుత్వానికి అమ్మవచ్చు. ఈ పథకం ద్వారా విద్యుత్ కోసం అయ్యే ఖర్చు ఆదా చేయడమే కాకుండా.. మీకు ఆదాయం కూడా వస్తుంది. ఈ పథకంలో భాగంగా 60 శాతం సబ్సిడీ ఇస్తారు.
స్టాండ్ అప్ ఇండియా.. కొత్త ప్రాజెక్టు కోసం బ్యాంక్ ద్వారా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళా రుణగ్రహితకు రూ.10 లక్షల నుంచి ఒక కోటి రూపాయల రుణం ఇవ్వడం స్టాండ్ అప్ ఇండియా పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రయోజనం పొందారు. వీరికి రూ. 23,827 కోట్ల రూపాయల రుణం ఇచ్చారు.
ఎంఎస్ఎంఈ స్కీమ్.. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసింది. దీని కింద వ్యాపారం ప్రారంభించడానికి స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఇలకు దాదాపు రూ. 2 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది.
స్వనిధి పథకం.. ప్రతి వర్గానికి రుణ అందించాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా దేశంలోని వీధి వ్యాపారులకు (చిరు వ్యాపారులు) తమ సొంత పనులను కొత్తగా ప్రారంభించడానికి రుణాలను మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్న వ్యాపారం కోసం ప్రజలకు రూ. 10,000 రూపాయల వరకు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Also read:
కృష్ణాజిల్లాలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు.. ఘటనాస్థలిలోనే బైఠాయించిన మాజీ మంత్రి.!
Bandla Ganesh: ‘నా ఊపిరి నీకు దాసోహం’.. తన దేవర పై బండ్ల గణేష్ కురిపించిన కవితావర్షం..
Snapdragon Insider: మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంత ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.