- Telugu News Photo Gallery Business photos Motorola one 5g uw ace with snapdragon 750g 5g triple rear cameras launched
Motorola One 5G UW Ace: మోటోరోలా నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన ఫీచర్స్..!
Motorola One 5G UW Ace: మోటోరోలా కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. మోటోరోలా వన్5జీ యూడబ్ల్యూ ఏస్ (One 5G UW Ace) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇంటర్నెట్..
Updated on: Jul 10, 2021 | 2:30 PM

Motorola One 5G UW Ace: మోటోరోలా కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. మోటోరోలా వన్5జీ యూడబ్ల్యూ ఏస్ (One 5G UW Ace) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇంటర్నెట్ సూపర్ స్పీడ్‌లో ఉండేందుకు ఇది 5జీ అల్ట్రా-వైడ్బ్యాండ్కనెక్టివిటీ సదుపాయంతో అందుబాటులోకి ఉంది. అలాగే డాల్బీఅట్మాస్, డీటీఎస్-ఎక్స్ లాంచి వెరిజోన్ అడాప్టివ్ సౌండ్ సిస్టం ఈ మోడల్‌లో ప్రత్యేకంగా ఉంది.

కొత్త మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్ ఆండ్రాయిడ్ 11తో వస్తోంది. అలాగే 20:9 యాస్పెక్ట్ రేషియాతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ మ్యాక్స్ వర్షన్ డిస్ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్750జీ ఎస్వోసీ, 4 జీబీ ర్యామ్ ఈ ఏస్ మోడల్‌లో ఉంది. వెనుక 3 కెమెరాలు.. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుండగా.. మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజీని పెంచుకోవచ్చు. 5జీ, 4జీ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివీటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో ఇది వస్తోంది. మరోవైపు మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్‌లో 5000 Mah బ్యాటరీ ఉండగా... 20 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోంది.

మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్4+64 జీబీ వేరియంట్ ధర 299.99 డాలర్లు (దాదాపు రూ.22,400)గా ఉంది. వొలానిక్ గ్రే కలర్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వెరిజోన్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రస్తుతం అమ్మకానికి ఉంది. అయితే భారత్‌లోకి దీన్ని ఎప్పుడు తీసుకొస్తారనే వివరాలను మోటోరోలా ప్రకటించలేదు.



