- Telugu News Photo Gallery Business photos Samsung poco realme redmi and other smartphones availabale at a huge discount in flipkart electronic sale
Flipkart Electronic Sale: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్స్ .. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్..!
Flipkart Electronic Sale: ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 2021 ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా..
TV9 Telugu Digital Desk | Edited By: Subhash Goud
Updated on: Jul 11, 2021 | 11:35 AM

Flipkart Electronic Sale: ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 2021 ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా ఎలక్ర్టానిక్ సేల్స్ ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ జూలై 10న ప్రారంభమైంది. 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై అనేక రకాల ఆఫర్లు అందిస్తున్నారు.

ఈ సేల్‌లో రియల్‌మి 7ప్రో (Realme 7 Pro) స్మార్ట్‌ఫోన్‌పై రూ.4 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు రియల్.కామ్ లో కూడా అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

శాంసంగ్ గెలక్సీ ఎఫ్62 (Samsung Galaxy F62)పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.29,999 ఉండగా, ఆఫర్‌లో రూ .19,999 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్‌మి ఎక్స్ 7 ప్రో (Realme X7 Pro)ను ఈ సేల్ లో రూ .3,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎక్స్3 ప్రో (Poco X3 Pro) స్మార్ట్ ఫోన్‌ను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 23,999 ఉండగా, కేవలం 17,249కే లభిస్తోంది. ఇక రెడ్‌మి 9ఐ (Redmi 9i) స్మార్ట్‌ఫోన్ 4జీబీ వేరియంట్‌ను రూ .8,299కే కొనుగోలు చేయవచ్చు.





























