Vijay Sethupathi: ఆహాలో ప్రసారమవుతున్న విక్రమార్కుడు.. పిసినారి డాన్‌గా నవ్వులు పూయించిన విజయ్ సేతుపతి
Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు.. ఓ వైపు డబ్బింగ్ సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో..
Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు.. ఓ వైపు డబ్బింగ్ సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాతో పాటు.. ఉప్పెన మూవీలో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల అలరించాడు. దీంతో విజయ్ సేతుపతి సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాలను రిలీజ్ చేయడానికి వేదికగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఎంచుకుంటున్నారు. అలా విజయ్ సేతుపతి తమిళంలో హీరోగా చేసిన సినిమా జుంగా. ఈ మూవీ ఇప్పడు తెలుగులో విక్రమార్కుడుగా డబ్ అయ్యింది.
ప్రముఖ డిజిటల్ ఛానల్ ఆహా లో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా 2018లో తమిళంలో రిలీజయింది. ఇప్పుడు తెలుగు లో డబ్ అయ్యింది. ఇప్పటికే అనేక డాన్ కథలు.. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా చూసాము.. అయితే ఈ విక్రమార్కుడి వెరీ వీరీ స్పెషల్ డాన్. పరమ పిసినారి డాన్ కథ. విజయ్ సేతుపతి పిసినారి తనం బాగా నవ్విస్తుంది. అయితే సినిమాలోని సన్నివేశాలు కొంచెం సాగినల్టు ఉండడంతో ప్రేక్షకుల్లో కొంచెం అసహనం కనిపించినా .. విక్రమార్కుడుగా విజయ్ సేతుపతి చేసిన పిసినారి చేష్టలు bదానికి యోయో (యోగిబాబు) పడే కష్టాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. భారీ హంగులు లేకుండా కామెడీ తో నవ్వించిన ఈ సినిమాతో దర్శకుడి టెస్ట్ తెలుస్తోంది. అంతేకాదు విజయ్ సేతుపతి ని ఇప్పటి వరకూ సీరియస్ క్యారెక్టర్స్ లో చూసిన వారు విక్రమార్కుడి తో కొత్త కోణాన్ని చూస్తారు. ఈ పాత్ర, ఈ సినిమా కొత్తగా అనిపిస్తాయి.
Also Read: స్వీట్ షాప్ లోని టేస్ట్ తో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా నేతి మైసూర్ పాక్ తయారీ