Covid Patient: ‘చికెడ్ పెడితేనే ఇంటికి వెళతా’.. కోవిడ్ ఆస్పత్రిలో రోగి డిమాండ్.. బిత్తరపోయిన వైద్యులు..

Covid Patient: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఇంకా అలాగే ఉంది. కరోనా కేసుల సంఖ్య ఒక రోజు తగ్గుతోంది. మరో రోజు పెరుగుతోంది. ఇంతలోనే..

Covid Patient: ‘చికెడ్ పెడితేనే ఇంటికి వెళతా’.. కోవిడ్ ఆస్పత్రిలో రోగి డిమాండ్.. బిత్తరపోయిన వైద్యులు..
Chicken
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 10, 2021 | 4:39 PM

Covid Patient: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఇంకా అలాగే ఉంది. కరోనా కేసుల సంఖ్య ఒక రోజు తగ్గుతోంది. మరో రోజు పెరుగుతోంది. ఇంతలోనే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కొత్త తలనొప్పిని తీసుకువస్తున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సీజన్, ఇంజెక్షన్ల కొరత అలాగే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే, కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరిన కొందరు ఆస్పత్రి నుంచి బయటకు రావాలాంటే భయపడిపోతున్నారు. మరికొందరు.. ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ నచ్చి, ఆస్పత్రుల్లో పెడుతున్న ఆహారం నచ్చి బయటకు వచ్చేందుకు మొండికేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని కోవిడ్ సెంటర్‌లో వెలుగు చూసింది.

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని ఒక కోవిడ్ సెంటర్‌లో పేషెంట్ విచిత్ర డిమాండ్‌కి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక రోగి డ్యాన్స్ చేస్తూ చికెన్ అడుగుతూ కనిపించాడు. అతని డిమాండ్‌ని బట్టి కోవిడ్ సెంటర్ ఆహారాన్ని ఎంతగానో ఇష్టపడ్డాడో ఇట్టే అర్థమవుతోంది. ఆ రోగి.. తాను ఆస్పత్రిలో చికెన్ తినకుండా ఇంటికి వెళ్ళబోనని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో కోవిడ్ కేర్ సెంటర్‌లోనే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. వాస్తవానికి.. అతనికి కరోనా సోకడంతో సాంగ్లి జిల్లాలోని ఓ ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్‌లో చేరాడు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ.. అతను కోవిడ్ సెంటర్‌ను విడిచి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అదేమంటే.. వింత వింత కారణాలు చెబుతున్నాడు. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను వీడనంటూ రోగి చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే, కోవిడ్ కేర్ సెంటర్‌లో, రోగులకు త్వరగా కోలుకోవడానికి బలవర్ధకమైన ఆహారం అందిస్తారు. ఈ క్రమంలోనే సాంగ్లీకి చెందిన ఓ రోగి అక్కడి ఆహారానికి ఫిదా అయ్యాడు. ఈ నేపథ్యంలోనే.. తనకు కరోనా తగ్గినప్పటికీ ఆస్పత్రిలో చికెన్ తినకుండా ఇంటికి వెళ్లనని పట్టుబట్టాడు. అంతేకాదు.. ఆస్పత్రి ఆవరణలో డ్యాన్స్ వేస్తూ అందరినీ నవ్వించాడు. కోవిడ్ పేషెంట్ అలా చేయడాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతని డిమాండ్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video:

Also read:

Mysore Pak Sweet: స్వీట్ షాప్ లోని టేస్ట్ తో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా నేతి మైసూర్ పాక్ తయారీ

Acharya Poster: ఆచార్య మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఆకట్టుకుంటున్న చరణ్ లుక్

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా ధరల పెంచేసిన కంపెనీ.. పెరిగిన ధరలు వివరాలు ఇవే..