Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా ధరల పెంచేసిన కంపెనీ.. పెరిగిన ధరలు వివరాలు ఇవే..

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి ఆ కంపెనీ బిగ్ షాక్ ఇచ్చింది. తమ బైక్‌ల ధరలను అమాంతం పెంచుతూ ప్రకటన విడుదల చేసింది రాయల్

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా ధరల పెంచేసిన కంపెనీ.. పెరిగిన ధరలు వివరాలు ఇవే..
Royal Enfield
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 10, 2021 | 4:18 PM

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి ఆ కంపెనీ బిగ్ షాక్ ఇచ్చింది. తమ బైక్‌ల ధరలను అమాంతం పెంచుతూ ప్రకటన విడుదల చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ. పెరిగిన ధరలు జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బైక్ మేటోర్350 ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హిమాలయన్, కాంటినెంటల్ జిటి650, ఇంటర్‌సెప్టర్ 650 ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ బైక్‌ల ధరలను సుమారు రూ. 10 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపింది.

ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్‌నోవా మూడు వేరియంట్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్‌ ధరలను కంపెనీ భారీగా పెంచింది. ఫైర్‌బాల్ వేరియంట్ ధరను రూ. 9,441 పెంచింది. పెంచిన ధరతో కలిపి ఇప్పుడు దాని ధర రూ .1,92,109 లకు పెరిగింది. అదే సమయంలో, స్టెల్లార్ వేరియంట్ ధరను రూ.9,665 పెంచింది. దాంతో దీని ధర 1,98,099 రూపాయలకు పెరిగింది. సూపర్‌నోవా వేరియంట్ ధరను రూ.10,048 ను పెంచారు. ప్రస్తుతం ఇది రూ .2,08,084 లకు అందుబాటులో ఉంది.

బుల్లెట్ 350 ధర ఎంత పెరిగిందంటే.. బుల్లెట్ 350 విషయానికొస్తే.. సిల్వర్ బ్లాక్, ఒనిక్స్ బ్లాక్ ధర రూ.4,767 పెరిగింది. ఇప్పుడు ఇది రూ. 1,58,485 లకు లభిస్తోంది. అంతకుముందు దీని ధర రూ. 1,53,718 గా ఉంది. ఇదే సమయంలో, బ్లాక్ బుల్లెట్ ధరను 4,979 రూపాయలు పెంచారు. దాంతో ఈ బైక్ ధర అంతకుముందు ఉన్న 1,60,775 రూపాయల నుండి 1,65,754 రూపాయలకు పెరిగింది. బుల్లెట్ ఇఎస్ 350 రేంజ్ ధరను రూ .5,459 పెంచింది. పెరిగిన ధరతో కలిపి ఇప్పుడు ఇది రూ .1,82,190 లకు అందుబాటులో ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 ఫీచర్లు/ఇంజిన్.. ఈ బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ / ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే, ఈ క్రూయిజర్ తరహా బైక్‌కు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ టైల్లైట్, ట్రిప్పర్ నావిగేషన్, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్, విండ్‌స్క్రీన్ మొదలైనవి ఇవ్వబడ్డాయి.

మెటోర్ 350 కి కంపెనీ కొత్త వీల్స్ ఇచ్చింది. దాంతోపాటుగా ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు ఇచ్చారు. అదే సమయంలో, ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాకబ్జార్బర్‌లతో వెనుక సస్పెన్షన్ సెటప్‌లో 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ ఇవ్వబడింది. ఇక బ్రేక్‌ల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 300 ఎంఎం డిస్క్ బ్రేక్, ముందు భాగంలో 270 ఎంఎం డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది.

Also read:

KTR: కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతాం.. కేటీఆర్​ ఘాటు కామెంట్స్

The BeeVi Toilet: అక్కడ టాయిలెట్ ను ఉపయోగిస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తారు.. మానవవ్యర్ధాలతో విద్యుత్ తయారీ ఎక్కడంటే

BJP Vs Congress: రైలు ఇంజిన్, కోచ్‌లు.. ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌ ఇదే..