Acharya Poster: ఆచార్య మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఆకట్టుకుంటున్న చరణ్ లుక్

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకోసమే మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరు తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Acharya Poster: ఆచార్య మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఆకట్టుకుంటున్న చరణ్ లుక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 10, 2021 | 4:45 PM

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరుతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్ , టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే చిరుకు జోడీగా కాజల్ అగర్వార్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. ఈ సినిమాలో చిరు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని మొదటి నుంచి టాక్ నడుస్తుంది.

తాజాగా ఆచార్య సినిమా నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చరణ్ గుబురు మీసాలతో , మెడలో రుద్రాక్ష ధరించి, నుదిటిన బొట్టుతో కనిపించారు. ఆచార్య లో సిద్ద అనే పాత్రలో చరణ్ నటిస్తున్నారు. అలాగే చిరు -చరణ్ నక్సలైట్స్ గా ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఈ సినిమాతోపాటు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ నటుస్తున్నాడు చెర్రీ. ఆర్ఆర్ఆర్ లో అల్లూరిసీతారామరాజు గా కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను పట్టాలెక్కించనున్నాడు చరణ్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Lakshmi Manchu: మరో సరికొత్త ప్రోగ్రామ్ తో రానున్న ఆహా .. మంచు లక్ష్మి హోస్ట్ గా ‘ఆహా భోజనంబు’

Baahubali: ఆరేళ్ళ బాహుబలి.. అమరేంద్ర బాహుబలి అదిరిపోయే ఫోటో షేర్ చేసిన పాన్ ఇండియా స్టార్

Bandla Ganesh: ‘నా ఊపిరి నీకు దాసోహం’.. తన దేవర పై బండ్ల గణేష్ కురిపించిన కవితావర్షం..