Baahubali: ఆరేళ్ళ బాహుబలి.. అమరేంద్ర బాహుబలి అదిరిపోయే ఫోటో షేర్ చేసిన పాన్ ఇండియా స్టార్

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది బాహుబలి.

Baahubali: ఆరేళ్ళ బాహుబలి.. అమరేంద్ర బాహుబలి అదిరిపోయే ఫోటో షేర్ చేసిన పాన్ ఇండియా స్టార్
Bahubali
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 10, 2021 | 3:23 PM

Baahubali: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది బాహుబలి. అప్పటివరకు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ప్రభాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సినిమా. ఈ ఒక్క సినిమాతో డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే రోజు అంటే జులై 10న బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉండటం తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘మహేంద్ర బాహుబలి’ ‘అమరేంద్ర బాహుబలి’ రెండు పాత్రల్లో ప్రభాస్ నటించగా.. భల్లాల దేవుడిగా రానా – దేవసేన గా అనుష్క – అవంతిక గా తమన్నా – శివగామిగా రమ్యకృష్ణ – కట్టప్ప గా సత్యరాజ్ – బిజ్జల దేవుడిగా నాజర్ నటించారు.అద్భుతమైన గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా వచ్చిన బాహుబలి అన్నివర్గాల  ప్రేక్షకులను అలరించింది. వెండి తెర అద్భుతంగా వచ్చిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను చెరిపేసింది. ‘బాహుబలి-1’ చిత్రం 2015 జూలై 10న విడుదలైంది. అంటే సరిగ్గా నేటికి 6 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకునే అద్భుతమైన సన్నివేశనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసాడు ప్రభాస్. ‘దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సినిమాటిక్ మ్యాజిక్ తరంగాలను సృష్టించిన చిత్ర బృందం ఇక్కడ ఉంది” అని పోస్ట్ చేసిన ప్రభాస్.. ‘బాహుబలి’ చిత్రానికి వర్క్ చేసిన వారందరినీ ట్యాగ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాను సుమారు 500 కోట్లకు పైగా వసూల్ చేసి సరికొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని ఇక్కడ చదవండి :

Bandla Ganesh: ‘నా ఊపిరి నీకు దాసోహం’.. తన దేవర పై బండ్ల గణేష్ కురిపించిన కవితావర్షం..

Taapsee Pannu: ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన తాప్సీ.. ఢిపరెంట్ లుక్‏లో షాకిచ్చిన హీరోయిన్..

Mohan Babu: మోహన్ బాబుపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?