Mohan Babu: మోహన్ బాబుపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. యూట్యూబ్‌లో మోహన్‌బాబు‌ను కొందరు టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారని..

Mohan Babu: మోహన్ బాబుపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
Mohan Babu
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 10, 2021 | 3:32 PM

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. యూట్యూబ్‌లో మోహన్‌బాబు‌ను కొందరు టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారని ఆయన లీగల్ అడ్వైజర్ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో మోహన్ బాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

అంతేకాకుండా అసభ్యకరమైన బూతులు కామెంట్స్ రూపంలో పెడుతున్నారని పేర్కొన్నారు. పొలిటికల్ మోజో అనే పేరు గల యూట్యూబ్ ఛానెల్ మోహన్ బాబును వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా.. బూతులు తిడుతూ వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారంటూ ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read:

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!

మోహన్ బాబును దూషిస్తూ బెదిరించిన వీడియో…