Mysore Pak Sweet: స్వీట్ షాప్ లోని టేస్ట్ తో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా నేతి మైసూర్ పాక్ తయారీ
Mysore Pak Sweet: స్వీట్స్ అంటే ఇష్టపడని వారు బహుఅరుదు.. ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా.. మైసూర్ పాక్ ది ఎప్పుడు స్పెషల్ ప్లేస్. చాలామంది ఇష్టంగా తినే ఈ మైసూర్ పాక్ ను..
Mysore Pak Sweet: స్వీట్స్ అంటే ఇష్టపడని వారు బహుఅరుదు.. ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా.. మైసూర్ పాక్ ది ఎప్పుడు స్పెషల్ ప్లేస్. చాలామంది ఇష్టంగా తినే ఈ మైసూర్ పాక్ ను స్వీట్స్ షాప్స్ నుంచి కొనుకుంటారు.. అయితే అంతే టెస్టుతో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా ఇంట్లో కూడా మైసూర్ పాక్ ను తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఇంట్లో టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ రెసిపీని తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
శనగపిండి – కప్పు పంచదార – కప్పు నెయ్య – కప్పు కంటే ఎక్కువ నీరు – అర కప్పు
తయారీ విధానం:
ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. అప్పుడు శనగ పిండిలో ఎటువంటి ఉండలు.. మొరం లేకుండా మొత్తగా వస్తుంది. దానిని మైసూర్ పాక్ తయారీకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి వెలిగించి, సిమ్ లో పెట్టి ఈ శనగపిండి వేసి పచ్చి వాసన పోయి , కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకూ శనగపిండిని కలుపుతూ వేయించాలి. వేగిన శనగపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని. అందులో కరిగిన నెయ్య వేసి బాగా కలుపుతూ జారుగా ఉండలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టి.. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టి సిమ్ ఫ్లేమ్ లో ఉంచి అరకప్పు నీళ్ళు పోసి .. కప్పు పంచదార వేసి కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగి బాండీ లో మిశ్రమం ఉడుకు వస్తుంది. ఒక చుక్క చూపుడు వేలిమీద వేసుకుని బొటన వేలితో నొక్కితే సన్నటి తీగ ఫార్మ్ అయ్యేవరకూ పంచదార పాకం పట్టి.. అందులో శనగపిండి మిశ్రమాన్ని వేయాలి. తరవాత పంచదార పాకంలో వేసిన మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో మిగిలిన నెయ్య రెండేసి చెంచాలు వేస్తూ .. అలా కలుపుతూ ఉండాలి. శనగపిండి పంచదార మిశ్రమం బాండీ కి అంటకుండా అటూ ఇటూ కదులుతూ నెయ్యి తేలుతూ ఉంటుంది. అంటే మైసూర్ పాక్ తయారీ పూర్తి కావడానికి వచ్చింది అన్న మాట. కొంచెం మిశ్రమం తీసుకుని వేలితో తీసి నలిపితే గుండ్రంగా గింజలా కూడా అవుతుంది.
అప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి.. రెడీ అయ్యిన మైసూర్ పాక్ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసుకుని.. ఎటువంటి బబుల్స్ లేకుండా సమానంగా సర్ధాలి.. కొంచెం సేపు అలా వదిలేస్తే.. చల్లారుతుంది. తర్వాత ఒక చాకు తో నచ్చిన షేప్స్ లో కట్ చేసుకుంటే మైసూర్ పాక్ రెడీ అవుతుంది.
అయితే ఈ మైసూర్ పాక్ చేసే సమయంలో కొంచెం శ్రమ.. శ్రద్ధ ఓపిక అవసరం.. పూర్తిగా తక్కువ మంటలోనే చేసుకోవాల్సి ఉంది. లేకపోతె మైసూర్ పాక్ సరిగ్గా రాకపోతే మేకులు కొట్టుకునే రాయిలా వాడుకోవాలి. అదే ఓపికగా చేసుకుంటే స్వీట్ షాప్ లోని మైసూర్ పాక్ టెస్ట్ తో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధానంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Also Read: కలియుగ దానకర్ణుడు..మ్యాన్ ఆఫ్ ద మిలీనియం.. ఈ తాతగారు 36 ఏళ్ల జీతం సహా రూ.30 కోట్లు పేదలకు దానం